వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

delhi violence: మసీదు, దర్గా ధ్వంసం, తర్వాత నిప్పు, మాస్క్ ధరించి, వ్యానులో వచ్చిన దుండగులు..

|
Google Oneindia TeluguNews

ఈశాన్య ఢిల్లీని ఆందోళనలు దహించి వేస్తున్నాయి. గత నాలుగురోజుల నుంచి హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. ఆందోళనలో మృతుల సంఖ్య 35కి చేరగా.. తమ మసీదును, దర్గాను ధ్వంసం చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆందోళనలు ఎంత పీక్ స్టేజీకి చేరాయో అర్థమవుతోంది.

మసీదు ధ్వంసం..

మసీదు ధ్వంసం..

ఈశాన్య ఢిల్లీలోని అశోక్‌నగర్‌లో గల మసీదును కొందరు ధ్వంసం చేశారని స్థానికులు ఆరోపించారు. తర్వాతే దానికి మంగళవారం మధ్యాహ్నం గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారని తెలిపారు. ఈ విషయం తమకు సోషల్ మీడియా ద్వారా తెలిసిందని చెప్పారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు పోలీసులు ఘటనాస్థానికి చేరుకున్నారు. ఘటన దురదృష్టకరం అని.. స్థానికులు మాత్రం మసీదును ధ్వంసం చేసి.. నిప్పు అంటించలేదని భావించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన దుండగులే దారుణానికి ఒడిగట్టి ఉంటారని ఆరోపించారు.

 దర్గా కూడా..

దర్గా కూడా..

అశోక్‌నగర్‌కు చెందిన మసీదు పురాతనమైదదని.. దానికి మరమ్మతు చేస్తున్నామని స్థానికులు తెలిపారు. ఇక్కడ ఇదివరకు కొన్ని ముస్లిం కుటుంబాలు ఉండేవని.. కానీ వారు కూడా వెళ్లిపోయారని పేర్కొన్నారు. మరోవైపు చాంద్‌బాగ్‌లో దర్గాను కొందరు ధ్వంసం చేశారు. ఘటనపై సజ్జద్ ఇబ్రహీం ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు అతివాదులు దారుణానికి ఒడికట్టారని.. హిందూ దేవాలయాలపై తాము ఎన్నడూ ఇలా వ్యవహరించలేమని గుర్తుచేశారు. కానీ దర్గాను ధ్వంసం చేయడంతో నోట మాట రావడం లేదన్నారు.

సోదరభావంతోనే..

సోదరభావంతోనే..

చాంద్‌బాగ్‌లో 70 శాతం మంది ప్రజలు ముస్లింలే ఉంటారు. దాని ఎదురుగా గల భాజన్‌పురలో 80 శాతం హిందువులు ఉంటారు. కానీ వీరి మధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. గొడవ పడిన దాఖలాలు లేవు. మొహానికి మాస్కులు వేసుకున్న కొందరు వ్యాన్లలో వచ్చి విధ్వంసం చేశారని పేర్కొన్నారు. ఆందోళనతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మెడికల్ షాపులు, కిరాణా షాపులు మూసివేశారు. దీంతో కూరగాయాలు, పాలు కొనుగోలు చేయడం కూడా కష్టంగా మారింది.

English summary
mosque and a dargah were vandalised before being set afire during the communal violence in northeast Delhi, locals claimed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X