వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అత్యంత కీలక బడ్జెట్.. 1991 తర్వాత తొలిసారి, కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ

|
Google Oneindia TeluguNews

1991 తర్వాత అత్యంత కీలక బడ్జెట్ 2021-22 అని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ అన్నారు. గత మూడేళ్లుగా జీడీపీ క్షీణిస్తూ వస్తోందని ఆయన అన్నారు. జీడీపీ 37వ నెలలో పడిపోయిందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని గమనించి నిర్మలా సీతారామన్ సీరియస్‌గా ఉండి ఉంటారని తెలిపారు. ఆర్థికసర్వే బడ్జెట్‌ను ప్రతిబింబిస్తోందని వివరించారు. పార్లమెంట్‌లో సీతరామన్ బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో మనీశ్ తివారీ కామెంట్ చేశారు. ఆమె వరసగా మూడోసారి బడ్జెట్ సమర్పిస్తోన్న సంగతి తెలిసిందే.

కరోనా వైరస్ క్రైసిస్ నేపథ్యంలో గతేడాది లాగానే బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. ఆర్థిక సర్వేలో ఆర్థిక వృద్ది 11 శాతం ఉంటుందని పేర్కొన్నది. వైద్యం, ఉపాధికి ప్రయారిటీ ఇచ్చారు. మౌలిక వసతుల కల్పన, మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, మేకిన్ ఇండియా, స్వయం ఉపాధికి భారీగా కేటాయింపులు చేసే అవకాశం ఉంది.

‘Most crucial budget after 1991 but may get a talkathon’: Manish Tewari jabs Nirmala Sitharaman

ఆర్థిక సర్వేను పార్లమెంట్‌లో రాష్ట్రపతి కోవింద్ చదివే సమయంలో ప్రతిపక్షాలు బాయ్ కాట్ చేశారు. బడ్జెట్ నేపథ్యంలో మాత్రం సభలో ఉండి.. లోపాలను ఎత్తి చూపుతారు. కేటాయింపులపై పెదవి విరిచే అవకాశం ఉంది.

English summary
Congress leader Manish Tewari took a swipe at Union finance minister Nirmala Sitharaman, who will present the budget for the fiscal year 2021-22 on Monday.1991 తర్వాత అత్యంత కీలక బడ్జెట్ 2021-22
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X