వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆటోమేషన్‌పై 87శాతం ఇండియన్ ఉద్యోగులు పాజిటివ్

ఆటోమేషన్ ప్రస్తుతం అన్ని రంగాల ఉద్యోగులపై ప్రభావం చూపుతోంది. ఆటోమేషన్ ప్రభావం పరిశ్రమ రూపురేఖలనే మార్చుతోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆటోమేషన్ ప్రస్తుతం అన్ని రంగాల ఉద్యోగులపై ప్రభావం చూపుతోంది. ఆటోమేషన్ ప్రభావం పరిశ్రమ రూపురేఖలనే మార్చుతోంది. అయితే ఆటోమేషన్ పట్ల ఇండియాకు చెందిన 87 శాతం మంది ఉద్యోగులు పాజిటివ్ అభిప్రాయపాయాన్ని వ్యక్తం చేశారు.

ఉద్యోగం పోతోందనే భయమున్నప్పటికీ, ఆటోమేషన్ ప్రభావం సానుకూలమేననే ఇండియాకు చెందిన ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఆటోమేషన్ ప్రభావంపై మైఖేల్ పేజ్ ఇండియా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

 Most Indian professionals positive about impact of automation: survey

మెజారిటీ ప్రోఫెషనల్స్ తమ ఉద్యోగాలపై విశ్వాసాన్ని కూడ వ్యక్తం చేశారు. వెయ్యికి పైగా భారతీయ ఉద్యోగాలపై ఈ అధ్యయనం చేశారు. ఆటోమేషన్ ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయమై ఈ సర్వే నిర్వహించారు.

87 శాతం మంది ఆటోమేషన్ ప్రస్తుత తమ పనితీరులో పాజిటివ్ ప్రభావాన్నే చూపుతోందని చెప్పారు. 78 శాతం మంది తమ భవిష్యత్ ఉద్యోగాలపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారని ఆ సంస్థ ప్రకటించింది.

తమ ఉద్యోగాలను రోబోటిక్స్ భర్తీ చేస్తాయని అనుకోవడం లేదని 83 శాతం రెస్పాడెంట్లు చెప్పారు. 17 శాతం మంది మాత్రమే తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసినట్టు చెప్పారు.

English summary
Contrary to the fear that automation is likely to take away jobs, many professionals in India are positive that it would rather create better job opportunities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X