India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రష్యా నుంచి యూరోప్ దేశాలే ఎక్కువ చమురు కొంటున్నాయి: యూఎస్, బ్రిటన్‌కు భారత్ కౌంటర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/లండన్: ఉక్రెయిన్‌పై దాడులకు పాల్పడుతున్న రష్యాకు సానుకూలంగా వ్యవహరిస్తోందంటూ భారత్‌పై అమెరికాతోపాటు బ్రిటన్ ఆరోపణలు చేస్తున్న క్రమంలో ఇందుకు భారత్ ఘాటుగా స్పందించింది. రష్యాపై ఆంక్షల విషయంలో బ్రిటన్ విదేశాంగ శాఖ సెక్రటరీ లిజ్ ట్రస్‌తో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్ తన వాదనను బలంగా వినిపించింది.

రష్యా నుంచి ఎక్కువ చమురు కొంటున్నది ఐరోపా దేశాలే: భారత్

రష్యా నుంచి ఎక్కువ చమురు కొంటున్నది ఐరోపా దేశాలే: భారత్

రష్యా నుంచి తక్కువ ధరలకు భారత్ చమురును దిగుమతి చేసుకుంటున్న క్రమంలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఉక్రెయిన్‌పై యుద్ధం ముందు కంటే ఎక్కువగా కూడా ఐరోపా దేశాలు రష్యా నుంచి చమురును ఎక్కువగా దిగుమతి చేసుకుంటుండటం గమనార్హం. ఇదే విషయాన్ని విదేశాంగ మంత్రి జైశంకర్ బ్రిటన్ ప్రతినిధి లిజ్ ట్రస్‌కు స్పష్టం చేశారు.
బ్రిటన్ విదేశాంగశాఖ సెక్రటరీ తరచూ రష్యా దాడుల గురించి ప్రస్తావించినప్పటికీ.. జైశంకర్ మాత్రం బ్రిటన్-భారత్ ద్వైపాక్షి సంబంధాలను మెరుగుపర్చుకునే అంశంపైనే ఎక్కువగా మాట్లాడారు. మొదటి ఇండియా-యుకె స్ట్రాటజిక్ ఫ్యూచర్స్ ఫోరమ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్, పాలసీ ఎక్స్ఛేంజ్ సంయుక్తంగా నిర్వహించింది. అనంతరం ద్వైపాక్షిక సమావేశం జరిగింది.

భారత్ ఏం చేయాలో తామెందుకు చెబుతామన్న బ్రిటన్

భారత్ ఏం చేయాలో తామెందుకు చెబుతామన్న బ్రిటన్

రష్యా నుంచి ఆయిల్ దిగుమతులను యూకే ఈ ఏడాది చివరి నాటికి ముగిస్తుందన్న లిజ్ ట్రస్.. డిస్కౌంట్ రేటుకు రష్యా నుంచి భారత్ చమురు కొనడంపై లిజ్ ట్రస్ స్పందించారు. భారత్ సార్వభౌమాధికారం కలిగిన దేశం.. వారు ఏం చేయాలో మేము ఎందుకు చెబుతామని అన్నారు. భారత్ తన నిర్ణయాన్ని తానే ప్రకటిస్తుందని తెలిపారు. అయితే, ఉక్రెయిన్‌లో మారణహోమం సృష్టిస్తున్న రష్యాను అడ్డుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందని అన్నారు. ఈ క్రమంలో జైశంకర్ మాట్లాడుతూ.. గత నెల ముందు కంటే కూడా యూరోప్ దేశాలు రష్యా నుంచి 15 శాతం అదనంగా చమురును కొనుగోలు చేశాయని తెలిపారు. రష్యా నుంచి గ్యాస్ దిగుమతి చేసుకుంటున్న మెజార్టీ దేశాలు కూడా ఐరోపాలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. మిడిల్ ఈస్ట్, అమెరికా కంటే రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్నది చాలా తక్కువేనని వెల్లడించారు.

రష్యా నుంచి చమురు కొంటున్నా.. టాప్10లో లేని భారత్..

రష్యా నుంచి చమురు కొంటున్నా.. టాప్10లో లేని భారత్..

భారతదేశం కొనుగోళ్లు ఆర్థిక ఆవశ్యకతపై ఆధారపడి ఉన్నాయని జైశంకర్ అన్నారు. చమురు ధరలు పెరిగినప్పుడు, దేశాలు మార్కెట్‌లోకి వెళ్లి వాటికి మంచి ఒప్పందాలను వెతకడం సహజమని నేను భావిస్తున్నాను. అయితే మేము రెండు లేదా మూడు నెలలు వేచి ఉండి, వాస్తవానికి రష్యన్ గ్యాస్, చమురు పెద్ద కొనుగోలుదారులు ఎవరో చూస్తే, జాబితా మునుపటి కంటే చాలా భిన్నంగా ఉండదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మేము ఆ జాబితాలో మొదటి 10 స్థానాల్లో ఉండలేమని నేను అనుమానిస్తున్నాను అని జైశంకర్ పేర్కొన్నారు.

రష్యాకు చైనా మద్దతిస్తుందనుకోవద్దు..: లిజ్ ట్రస్..

రష్యాకు చైనా మద్దతిస్తుందనుకోవద్దు..: లిజ్ ట్రస్..

రష్యా దూకుడును చూసి చైనా ఎలా ప్రవర్తిస్తుందనే దానిపై లిజ్ ట్రస్ మాట్లాడుతూ.. "నేను నా చైనా కౌంటర్ వాంగ్ యితో మాట్లాడాను. చైనా ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తుందని స్పష్టంగా ఉంది. ఇది P-5 సభ్యుడిగా, బాధ్యతాయుతమైన దేశంగా చైనా కట్టుబడి ఉండాల్సిన ముఖ్యమైన సూత్రం. అందువల్ల ఉక్రెయిన్‌లో రష్యా చర్యలకు చైనా మద్దతు ఇస్తున్నట్లుగా మనం చూడకూడదన్నారు.

తాలిబన్లు దాడులు చేస్తే ఆప్ఘాన్‌లో అలా.. ఇప్పుడు ఇలా

తాలిబన్లు దాడులు చేస్తే ఆప్ఘాన్‌లో అలా.. ఇప్పుడు ఇలా

నైతిక స్థితిని తీసుకోవాల్సిన ఆవశ్యకతపై, జైశంకర్ స్పందిస్తూ.. ప్రస్తుత పరిస్థితులు గత సంవత్సరం ఆఫ్ఘనిస్తాన్‌లోని పరిస్థితికి సమాంతరంగా ఉన్నాయి. గత సంవత్సరం ఆగస్టులో తాలిబాన్ ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు జరిగిన సంఘటనల కారణంగా భారతదేశం, యూరప్‌ను ఎలా ప్రభావితం చేయలేదని అన్నారు. అయితే, ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ప్రపంచ దేశాలు స్పందిస్తున్న తీరు చర్చనీయాంశమేనని అన్నారు.

English summary
‘most Russian oil buyers in Europe’: Liz Truss-Jaishankar faceoff over sanctions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X