వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

19 ఏళ్ళుగా పట్టుబడని మోస్ట్ వాంటెడ్ సిమీ ఉగ్రవాది.. అబ్దుల్లా డానిష్ ను పట్టుకున్న ఢిల్లీ పోలీసులు

|
Google Oneindia TeluguNews

పోలీసులకు పట్టుబడకుండా తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని ఎట్టకేలకు పట్టుకున్నారు ఢిల్లీ పోలీసులు టెర్రరిస్టు గ్రూపు అయిన సిమీ ఉగ్రవాద సంస్థకు ముఖ్య సభ్యుడిగా వ్యవహరిస్తున్న ఉగ్రవాది అబ్దుల్లా డానిష్ ను అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. గత 19 సంవత్సరాలుగా అతను పరారీలో ఉన్నట్లుగా పేర్కొన్నారు. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా 2002 నుంచి అతని కోసం వెతుకుతున్నట్లుగా పోలీసులు ప్రకటించారు

ముస్లిం యువకులను సిమీ వైపు ఆకర్షిస్తున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్

ముస్లిం యువకులను సిమీ వైపు ఆకర్షిస్తున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్

స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాకు చెందిన ఉగ్రవాది అబ్దుల్లా డానిష్ ను అరెస్టు చేసినట్లు తెలుస్తుంది. 58 ఏళ్ల నిందితుడు, అబ్దుల్లా డానిష్, సిమి ఉగ్రవాద సంస్థకు చెందిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు. అతనిపై దేశ రాజధానిలో దేశద్రోహానికి పాల్పడినట్లుగా పలు కేసులు ఉన్నాయి అవి స్పెషల్ సెల్ సీనియర్ పోలీసు అధికారి ప్రమోద్ సింగ్ కుష్వా ఒక ప్రకటనలో తెలిపారు. .
గత 25 సంవత్సరాలలో చాలా మంది యువ ముస్లింలను ఉగ్రవాదం వైపు తీసుకువెళ్లిన, వారికి ఉగ్రవాదాన్ని బోధించిన సిమి కీలక సభ్యులలో అబ్దుల్లా డానిష్ ఒకరు అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.

సిమి పత్రిక 'ఇస్లామిక్ మూవ్మెంట్' హిందీ వెర్షన్ కు చీఫ్ ఎడిటర్ గా పని చేసిన అబ్దుల్లా డానిష్

సిమి పత్రిక 'ఇస్లామిక్ మూవ్మెంట్' హిందీ వెర్షన్ కు చీఫ్ ఎడిటర్ గా పని చేసిన అబ్దుల్లా డానిష్

అబ్దుల్లా డానిష్ సిమి పత్రిక 'ఇస్లామిక్ మూవ్మెంట్' యొక్క హిందీ వెర్షన్ కు చీఫ్ ఎడిటర్ గా నాలుగు సంవత్సరాలు పనిచేశాడని పోలీసులు తెలిపారు.

అబ్దుల్లా డానిష్ ఉత్తరప్రదేశ్‌లోని మౌ నివాసి, యూపీలోని అలీగడ్ లో కూడా ఇల్లు ఉందని పోలీసులు తెలిపారు. ట్రయల్ కోర్టు 2002 లో అతన్ని మోస్ట్ వాంటెడ్ గా ప్రకటించింది . అప్పటి నుండి పోలీసులు అతని కోసం వెతుకుతున్నారు. స్పెషల్ సెల్‌కు చెందిన సీనియర్ పోలీసు అధికారి అత్తార్ సింగ్ గత ఏడాది కాలంగా నేషనల్ క్యాపిటల్ రీజియన్, యూపీలో అబ్దుల్లా డానిష్ కార్యకలాపాలను ట్రాక్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మతకల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్న అబ్దుల్లా డానిష్

మతకల్లోలాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్న అబ్దుల్లా డానిష్


సిమి ఉగ్రవాది అబ్దుల్లా డానిష్ ముస్లిం యువకులను ఎన్‌ఆర్‌సి, సిఎఎలకు వ్యతిరేకంగా సమీకరించటానికి , వారితో పనిచేయడానికి మరియు మత కల్లోలాలు సృష్టించడానికి ఉగ్రవాద భావజాలాన్ని ప్రచారం చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు .
ముస్లింలపై ప్రభుత్వం దారుణాలకు పాల్పడుతుందని చూపించడానికి అబ్దుల్లా డానిష్ నకిలీ వీడియోలను ప్రసారం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒక సంవత్సరానికి పైగా శ్రమించిన తరువాత, డిసెంబర్ 5 న అబ్దుల్లా డానిష్ గురించి నిర్దిష్ట సమాచారం అందుకున్నామని, దీని ఆధారంగా, ఢిల్లీ లోని జాకీర్ నగర్ సమీపంలో అబ్దుల్లా డానిష్ ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా సిమీ సంస్థపై 2001 లో ప్రభుత్వ నిషేధం

ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా సిమీ సంస్థపై 2001 లో ప్రభుత్వ నిషేధం

సిమి సంస్థను 1977 లో అలీగడ్ లో ఏర్పాటు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాల కారణంగా దీనిని 2001 లో ప్రభుత్వం నిషేధించింది. పోలీసుల వివరాల ప్రకారం, అబ్దుల్లా డానిష్ 1985 లో అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుండి అరబిక్ లో ఎంఏ చేసాడు. సిమి ప్రభావంతో ఆయన ఉగ్రవాదిగా మారాడు . సిమిలో చేరిన తరువాత, అబ్దుల్లా డానిష్ సిమి యొక్క కార్యక్రమాలకు హాజరుకావడం ప్రారంభించాడు . అప్పటి అధ్యక్షుడు అష్రఫ్ జాఫ్రీ సిమి, 1988 లో సిమి పత్రిక యొక్క హిందీ ఎడిషన్ సంపాదకుడిగా అబ్దుల్లా డానిష్ కు బాధ్యతలు అప్పగించారు . భారతదేశంలో ముస్లింలపై జరిగిన దారుణాలను వక్రీకరించి అతను అనేక మత విద్వేషాలు రగిల్చే కథనాలను రాశాడు అని పోలీసులు తెలిపారు.

2002 నుండి మోస్ట్ వాంటెడ్ అబ్దుల్లా డానిష్ కోసం పోలీసుల అన్వేషణ .. ఫైనల్ గా ఢిల్లీ లో అరెస్ట్

2001 లో దక్షిణ ఢిల్లీ లోని జాకీర్ నగర్‌లోని సిమి స్థావరాలపై వద్ద జరిగిన దాడిలో, అబ్దుల్లా డానిష్ తప్పించుకున్నాడు . అప్పటి నుండి అండర్ గ్రౌండ్ లోఉన్నాడని పోలీసులు తెలిపారు. పోలీసుల అరెస్టు నుండి తప్పించుకోవడానికి అతను తన స్థావరాన్ని మారుస్తూ ఉన్నాడని , అబ్దుల్లా డానిష్ ద్వారా, ఉగ్రవాది అబ్దుస్ సుభాన్ ఖురేషి తో పాటు , మరొక ఉగ్రవాది అబూ బషర్ లు ఇద్దరూ 2008 లో అహ్మదాబాద్లో వరుస పేలుళ్లను ప్లాన్ చేసి అమలు చేశారు. అహ్మదాబాద్ పేలుళ్ల తర్వాత అలీగడ్ లోని అబ్దుల్లా డానిష్ ఇంట్లో బస చేశారు అని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.
దీంతో సిమీ కీలక సభ్యుడిని నేడు అరెస్ట్ చేశామని చెప్పారు.

English summary
A terrorist of the Students' Islamic Movement of India who had been on the run for the last 19 years has been arrested, the Delhi Police said in a statement. The 58-year-old accused, Abdullah Danish, was "one of the most elusive members" of the terrorist group SIMI and was wanted for sedition in the national capital, said senior police officer of the special cell Pramod Singh Kushwah said in the statement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X