వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోటేరా స్టేడియం.. అపూర్వమైన ప్రపంచ రికార్డులకు వేదిక

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

మొటేరా స్టేడియం
Click here to see the BBC interactive

మోటేరా స్టేడియంకు, క్రికెట్ రికార్డులకు అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ నెలకొల్పినన్ని రికార్డులు ప్రపంచంలో మరే క్రికెట్ మైదానంలోనూ నెలకొల్పి ఉండరు.

1983 ఫిబ్రవరిలో అప్పటి భారత రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్.. అహ్మదాబాద్‌కు కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న మోటేరా గ్రామం సమీపంలో గుజరాత్ క్రికెట్ అసోసియేన్ స్టేడియంకు పునాదిరాయి వేశారు.

తరువాత సరిగ్గా తొమ్మిది నెలలకు, అదే ఏడాది ఈ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ ఇండియా, వెస్టిండీస్‌ల మధ్య జరిగింది.

38 ఏళ్ల క్రితం భారత్‌లో తొమ్మిది నెలల్లో ఒక క్రికెట్ స్టేడియం రూపుదిద్దుకోవడం అనేది ఊహకందని విషయం.

శర వేగంతో పనులు పూర్తి చేసుకుని రికార్డ్ టైమ్‌లో మోటేరా స్టేడియం తయారైంది. ఈ స్టేడియం రికార్డుల జాబితాలో అది మొదటి రికార్డ్.

అప్పట్లో ఈ స్టేడియం ఇన్ని రికార్డులకు వేదిక అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇప్పుడు 2021లో మనం కచ్చితంగా చెప్పొచ్చు.. భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని రికార్డులు నమోదవుతాయని.

2020లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారత పర్యటన సందర్భంగా ఫిబ్రవరి 24న ఈ స్టేడియంలో ఒక పెద్ద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ స్టేడియం పేరు సర్దార్ పటేల్ గుజరాత్ స్టేడియం అని నామకరణం చేశారు. కానీ, అందరూ దీన్ని మోటేరా స్టేడియం అనే పిలుస్తారు. తాజాగా ఈ మైదానం పేరును నరేంద్ర మోదీ స్టేడియంగా మారుస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.

దీని సామర్థ్యం మరొక రికార్డ్. 1,10,000 మంది ప్రేక్షకులు కూర్చోగలిగేలా ఈ స్టేడియంను నిర్మించారు. దీంతో, ఇప్పటివరకూ ప్రపంచంలో అతి పెద్ద స్టేడియంగా ప్రాచుర్యంలో ఉన్న మెల్​బోర్న్ క్రికెట్ స్టేడియం రెండో స్థానానికి వెళ్లిపోయింది.

ఇప్పుడు, మోటేరా స్టేడియంలో అటగాళ్లు సృషించిన రికార్డుల హోరు చూద్దాం.

మోటేరా స్టేడియం

గావస్కర్ ఇక్కడే 10,000 పరుగులు పూర్తి చేశాడు

1983లో ఈ గ్రౌండ్‌లో తొలి మ్యాచ్ జరిగే సమయానికి, టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డ్ ఇంగ్లండ్ క్రికెటర్ జెఫ్ బాయ్‌కాట్ పేరు మీద ఉండేది. అప్పటికి బాయ్‌కాట్ 8,114 పరుగులు చేశాడు.

అయితే, ఆ మ్యాచ్‌లో సునీల్ గావస్కర్ 90 పరుగులు సాధించి బాయ్‌కాట్ రికార్డ్ బద్దలుగొట్టాడు.

ఈ గ్రౌండ్ గావస్కర్‌కు బాగా అచ్చొచ్చింది. 1987లో పాకిస్తాన్‌తో ఇక్కడ టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు గావస్కర్ 10,000 పరుగులు పూర్తి చేశాడు.

ఆ విధంగా టెస్టుల్లో తొలి 10,000 పరుగులు సాధించిన ఘనతకు మోటేరా స్టేడియం సాక్షిగా నిలిచింది.

టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్ల రికార్డ్

టెస్ట్ మ్యాచుల్లో అత్యధిక పరుగులే కాక అత్యధిక వికెట్లు సాధించినది కూడా ఈ గ్రౌండ్‌లోనే. ఆ ఘనత సాధించినది కపిల్ దేవ్.

1994 ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో హసన్ తిలకరత్నే వికెట్ తీయడంతో కపిల్ దేవ్ ఈ రికార్డ్ సొంతం చేసుకున్నాడు.

అది కపిల్ దేవ్‌కు 432వ వికెట్. దాంతో, 431 వికెట్లు తీసి అగ్రస్థానంలో ఉన్న న్యూజీలాండ్ బౌలర్ రిచర్డ్ హెడ్లీ రెండో స్థానానికొచ్చేశాడు.

అలా మోటేరా స్టేడియం కపిల్ దేవ్‌కు, మనకూ చిరస్మరణీయమైంది.

సచిన్ తొలి డబుల్ సెంచరీ చేసింది ఇక్కడే

సచిన్ టెండూల్కర్ తొలి డబుల్ సెంచరీ

సచిన్ టెండూల్కర్ 100 అంతర్జాతీయ శతకాలు సాధించాడు. బహుశా, ప్రపంచంలో సచిన్ సెంచరీ చేయని మైదానమే లేదేమో.

అయితే, ఒక అద్భుతమైన సెంచరీ మాత్రం టెండూల్కర్ మోటేరా గ్రౌండ్‌లోనే చేశాడు.

1991లో న్యూజీలాండ్‌తో జరిగిన టెస్ట్ సీరీస్‌లో భాగంగా సచిన్ తన కెరీర్లో మొట్టమొదటి డబుల్ సెంచరీ మోటేరా మైదానంలోనే సాధించాడు. ఆ మ్యాచ్‌లో సచిన్ 217 పరుగులు చేశాడు.

అజారుద్దీన్

అజారుద్దీన్ అపురూపమైన రికార్డ్

మహమ్మద్ అజారుద్దీన్ భారత్ తరఫున 99 టెస్టులు ఆడాడు. అయితే, అజారుద్దీన్ పేర ఒక ప్రత్యేకమైన రికార్డు ఉంది.

ఇండియా, సౌత్ ఆఫ్రికాల మధ్య 1996 నవంబర్‌లో ఈ మైదానంలోనే ఒక టెస్ట్ జరిగింది.

ఆ మ్యాచ్‌లో ఆడడం ద్వారా అజారుద్దీన్ ప్రపంచంలో క్రికెట్ ఆడే అన్ని దేశాలతో, అన్ని అంతర్జాతీయ మైదానాలలో టెస్ట్ ఆడిన తొలి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.

అప్పటికి ఇండియాతో కలిపి తొమ్మిది దేశాలు టెస్ట్ క్రికెట్ ఆడుతూ ఉండేవి. అజారుద్దీన్ ఎనిమిది దేశాలతో భారత్‌లోని అన్ని మైదానాల్లోనూ, అన్ని అంతర్జాతీయ మైదానాల్లోనూ టెస్ట్ క్రికెట్ ఆడిన ఘనత సాధించాడు.

ఇది అజారుద్దీన్‌కు మాత్రమే సొంతమైన ఒక ప్రత్యేకత. మోటేరా స్టేడియం దీనికి సాక్ష్యంగా నిల్చింది.

క్రికెట్

ఇతర రికార్డులు

భారత స్పిన్నర్ శివలాల్ యాదవ్ తన 100వ వికెట్ మోటేరా స్టేడియంలోనే సాధించాడు. 1987లో పాకిస్తాన్‌తో ఆడిన టెస్ట్ మ్యాచ్‌లో సలీం మాలిక్ వికెట్ తీయడం ద్వారా 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలోకి చేరాడు.

భారత్ తొలిసారిగా.. లంచ్‌కు ముందే ఆలౌట్ అయిన సంఘటన ఇక్కడే జరిగింది. 2008లో ఇండియా, సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు మొదటి రోజు 76 పరుగులకే లంచ్‌కు ముందే ఆలౌట్ అయిపోయింది.

2009 ఏప్రిల్‌లో రాహుల్ ద్రావిడ్ మోటేరా స్టేడియంలోనే టెస్టుల్లో 11,000 పరుగులు పూర్తి చేశాడు.

2010 నవంబర్‌లో ఈ మైదానంలోనే న్యూజీలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా 15 పరుగుల్లో 5 వికెట్లు కోల్పోగా.. హర్భజన్ సింగ్ వచ్చి, సెంచరీ చేసి జట్టు పరువు నిలబెట్టాడు. ఇదే హర్భజన్ టెస్టుల్లో చేసిన మొదటి సెంచరీ. ఆ తరువాతి టెస్టులో కూడా మరో సెంచరీ వేశాడు.

2012లో చతేశ్వర్ పూజారా తన కెరీర్లో తొలి డబుల్ సెంచరీ మోటేరా గ్రౌండ్‌లోనే సాధించాడు. ఇంగ్లండ్‌తో ఆడిన ఆ మ్యాచ్‌లో 206 పరుగులు చేశాడు.

1996 ప్రపంచ కప్ తొలి మ్యాచ్ ఇక్కడే జరిగింది. ఆ మ్యాచ్‌లో న్యూజీలాండ్, ఇంగ్లండ్‌ను ఓడించింది.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Motera Stadium:A venue for unprecedented world records
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X