వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

viral video:తల్లి ప్రేమ కన్నా మిన్న ఏదీ.. కొట్టుకుపోతున్న పిల్ల ఏనుగును కాపాడిన తల్లి.. వైరల్

|
Google Oneindia TeluguNews

ఈ సృష్టిలో పిల్లలపై తల్లి చూపే ప్రేమ వర్ణణాతీతం. ఎందుకంటే కొన్ని సార్లు తన ప్రాణం రిస్క్ చేసి మరీ కాపాడుతుంది. అవును ఇదీ అన్నీ జీవులకు వర్తిస్తోంది. మనుషులు మాటలతో చెబుతారు. మూగజీవాలు చేష్టల ద్వారా చెబుతాయి. పిల్ల ఏనుగును కాపాడేందుకే తల్లి ఏనుగు సాహసమే చేస్తోంది. అవును తన ప్రాణాలకు తెగించింది. వాగులో ముందుకు వెళ్లి మరీ కాపాడింది. ఆ సమయంలో అదీ తన గురించి ఏమాత్రం ఆలోచించలేదు. ఆ రెండు కలిసి చివరకు గట్టుకు వెళ్లాయి. ఆ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కాశ్వాన్ షేర్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతుంది. చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు.

 ఏనుగు మంద

ఏనుగు మంద

ఏనుగు మంద తిరిగి ఇంటికి వెళుతున్నాయి. అయితే మధ్యలో ఉన్న వాగు దాటాల్సి వచ్చింది. అలా ఒక్కొటి దాటుతున్నాయి. అయితే పిల్ల ఏనుగు కూడా దాటే ప్రయత్నం చేసింది. కానీ అదీ ప్రవాహానికి కొట్టుకొని పోతుంది. గమనించిన తల్లి ఏనుగు.. సాహసమే చేసింది. నీటికి ఎదురొడ్డింది. తన తొండంతో పిల్ల ఏనుగును కాపాడుకోగలిగింది.

రెండు కలిసి..

రెండు కలిసి..


తర్వాత ఆ రెండు కలిసి మందతో కలిసి వెళ్లాయి. వీడియోను ఉత్తర బెంగాల్‌లో గల నగ్రకట సమీపంలో తీశారు. ఆ వీడియోను ఇప్పటికే 32 వేల సార్లు చూశారు. 1836 లైకులు వచ్చాయి. సోషల్ మీడియో వేదికల్లో వీడియోను షేర్ చేస్తున్నారు. దీంతో అదీ వైరల్ అయ్యింది. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. వావ్ అంటూ తల్లి ఏనుగుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

 జెడ్ ప్లస్ ప్లస్ ప్లస్ సెక్యూరిటీ

జెడ్ ప్లస్ ప్లస్ ప్లస్ సెక్యూరిటీ


అప్పుడే పుట్టిన ఏనుగు పిల్లకు తల్లి కన్నా ఎవరు భద్రత కల్పిస్తారు. ఇదీ జెడ్ ప్లస్ ప్లస్ ప్లస్ భద్రతతో సమానం అని నందా ట్వీట్‌కు సత్యమంగళం కొయంబత్తూర్ రాశారు. వీడియోను చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ వీడియోను ఇప్పటివరకు 3.81 లక్షల సార్లు చూశారు. 1500 సార్లు రీట్వీట్ చేశారు. ఆ వీడియోను కూడా చాలా మంది కామెంట్ చేశారు.

English summary
video gaining traction on the internet shows. elephant herd is seen crossing a river to go into the forest. mother is left behind with her calf trying to navigate the fast-flowing water.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X