వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మ కానీ అమ్మ.. కోడలికి కొత్త జీవితాన్ని ఇచ్చిన అత్త

|
Google Oneindia TeluguNews

యశ్వంత్‌పుర : అత్త, కోడళ్లు అంటే నిత్యం పోట్లాటలే. ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే సఖ్యంగా ఉంటారు. తల్లిలా చూసుకుంటామని, బిడ్డలా ఆదరిస్తామని మాటలే చెప్తారు. కానీ చేతలు వేరు. కానీ కర్ణాటకలో మాత్రం ఓ అత్త కోడలికి తల్లిలా మారింది. తల్లి చేయలేని పని కూడా చేసి ఆదర్శంగా నిలిచింది. పలువురి చేత శెభాష్ అనిపించుకుంటుంది.

mother in law marry to her sister in law

కర్ణాటకలోని మంగళూరు జిల్లా సుళ్య తాలుకా కళంజ గ్రామానికి చెందిన సుశీల అదే ఊరికి చెందిన మాధవను పెళ్లి చేసుకుంది. పెళ్లైన తర్వాత కాపురం సవ్యంగా సాగింది. గర్భవతై.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కొన్నాళ్లకు మాధవ చనిపోయాడు. రోడ్డు ప్రమాదం కబళించడంతో భర్త దూరమయ్యాడు. దీంతో కోడలిని చూడలేకపోయింది అత్త. ఆమెకు మరో జీవితం ఇవ్వాలని భావించింది. మరో పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది.

తనకు కొడుకు దూరం కాగా .. కోడలు సుశీలకు భర్త, బిడ్డకు తండ్రి దూరమయ్యాడని అత్త ఆలోచించింది. మరో పెళ్లి చేసుకోవాలని సూచించింది. అయితే ఇందుకు కోడలు ఒప్పుకోలేదు. కానీ తాను తల్లిలా మారి, నాలుగు మంచి మాటలు, భవిష్యత్ గురించి చెప్పింది. బంట్వాళ తాలుకా కన్యా గ్రామానికి చెందిన జయప్రకాశ్‌తో పెళ్లి జరిపించింది. దీనిని చూసిన పలువురు అత్త మంచి మనస్సును కొనియాడారు. కోడలు గురించి ఇంత ఆలోచించడం మంచి పరిణామామని పొగడ్తలతో ముంచెత్తారు.

English summary
Sushila of Mangalore district of Karnataka is married to Madhava, a native of the same village. Kapuram went well after the wedding. Pregnant gave birth to a baby boy. Madhava had been dead. The aunt could not see sister-in-law.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X