వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కూతుర్ను కాపాడేందుకు మొసలితో పోరాడిన తల్లి

|
Google Oneindia TeluguNews

వడోదరా: ఓ మహిళ తన కూతురును కాపాడుకునేందుకు తన ప్రాణాలను లెక్క చేయకుండా మొసలితో పోరాడింది. ఈ పోరాటంలో మొసలిని ధైర్యంగా ఎదుర్కొని తన కూతురును కాపాడుకుంది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని వడోదరా జిల్లాలోని తికారియా ముబారక్ గ్రామంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. తికారియా ముబారక్ గ్రామ సమీపంలోని విశ్వామిత్ర నదిలో బట్టలు ఉతుకునేందుకు కంతా వాంకర్ (19) ఎప్పటిలాగే శుక్రవారం కూడా నది వద్దకు చేరుకుని... బట్టలు ఉతకడం ప్రారంభించింది. అంతలో నదిలోని మొసలి ఆమె కాలును నోట కరచి అమాంతంగా నదిలోకి లాగింది. దీంతో అక్కడే ఉన్న ఆమె తల్లి దీపాలి వెంటనే స్పందించింది.

Mother jumps to rescue daughter from crocodile

బట్టలు ఉతికే కర్రతో మొసలి తలపై దాదాపు 10 నిమిషాలు ఏకధాటిగా బలంగా కొట్టింది. దాంతో మొసలి.. ఆమె కుమార్తె కాంత వాంకర్ కాలు వదిలి నదిలోకి జారుకుంది. వెంటనే దీపాలి తన కుమార్తెను ఆస్పత్రికి తరలించింది. వైద్యులు ఆమెకు చికిత్స అందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

కాగా, విశ్వామిత్ర నదిలో దాదాపు 260 మొసళ్లు ఉన్నట్లు ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన గణాంకాల ద్వారా తేలిందని అటవీ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. నది పరివాహాక ప్రాంతంలో బట్టలు ఉతకవద్దని గ్రామస్తులను ఇప్పటికే హెచ్చరించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

English summary
A 58-year-old woman jumped to the rescue of her daughter who was attacked by a crocodile while the latter was bathing in a river at Thikariya Mubarak village in the district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X