• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మదర్ సోఫియా పెళ్లికి.. దేవుళ్లకూ ఆహ్వానం!

By Ramesh Babu
|

ముంబై: మాజీ మోడల్ సోఫియా హయత్ మళ్లీ ఒక సంచలన ప్రకటన చేశారు. గతేడాది క్రైస్తవ సన్యాసినిగా మారిన ఆమె నాలుగు రోజుల క్రితం హఠాత్తుగా తాను పెళ్లిచేసుకోనున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అంతేకాదు, తన వివాహానికి తన బంధుమిత్రులతోపాటు దేవుళ్లనూ పిలుస్తానని ఆదివారం వెల్లడించి మరోసారి విస్మయపరిచారు.

ఆమె వివాహ ఆహ్వానితుల జాబితాలో శివుడు, బుద్ధుడు మొదలుకొని బాలీవుడ్ శృంగార తార రాఖీ సావంత్ వరకు పలువురి పేర్లు ఉన్నాయి. భారత సంతతికి చెందిన సోఫియా హయత్ బ్రటీష్ మాజీ సినీనటి, మోడల్, సింగర్. 2013లో ప్రపంచ సెక్సీ యువతుల్లో 81వ స్థానం కూడా పొందారు.

ప్రముఖ మ్యాగజైన్ వోగ్ ఇటాలియా 2012లో ఆమెను అందమైన ఒంపుసొంపులున్న మహిళల జాబితాలో చేర్చింది. ఆమె వయసు గురించి మాత్రం భిన్నమైన వార్తలు వచ్చాయి. సోఫియా 1974లో పుట్టినట్లు కొన్ని పత్రికలు రాస్తే.. కాదు 1984లో జన్మించినట్లు మరికొన్ని పత్రికలు పేర్కొన్నాయి.

Mother Sofia Hayat decides her wedding guest list, includes Lord Shiva and Rakhi Sawant

అయితే ఉన్నట్లుండి 2016 జూన్ లో సోఫియా ఎందుకో నన్ గా మారి ఆధ్యాత్మిక జీవనంలోకి వెళ్లారు. తన పేరును కూడా గయ్యా సోఫియా మదర్ గా మార్చుకున్నారు. తాను జీవితంలో పెళ్లి చేసుకోనని, శృంగారంలో పాల్గొనననీ, పిల్లల్ని కనననీ ప్రకటించారు.

అయితే ఇప్పుడు ఆమె మనసు మార్చుకున్నారు. నాలుగు రోజుల క్రితం తనకు ఒకరితో నిశ్చితార్థం జరిగిందని, త్వరలోనే అతడి పేరు వెల్లడిస్తానని, ఈ నెలలోనే తాము పెళ్లిచేసుకోబోతున్నామని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

తాజాగా తన వివాహానికి ఎవరెవరిని పిలవబోతున్నదీ వెల్లడించారు. పైగా స్వర్గంలో జీసస్ అంటే ఏసుక్రీస్తు తన జీవితం గురించి ఈ విధంగా నిర్ణయించారని, అందుకే తాను సన్యాసం వీడి వైవాహిక జీవితంవైపు అడుగులేస్తున్నానని వ్యాఖ్యానించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Days after revealing that she got engaged, model-turned-nun Sofia Hayat surprised everybody with yet another post on Sunday. This time she has revealed the guest list for her wedding later this month.“I promise to announce my fiance’s name on Instagram in the coming week. I will get married to him in the third or fourth week March,” Sofia told Hindustan Times. “He (fiancee) is special to me and our love and marriage is sacred. All the Gods including Shiva, Buddha will be part of our marriage. This is a decision made by Jesus in heaven,” she added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more