వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖం, ఛాతీలపై మహిళపై బుల్లెట్ల వర్షం: కొడుకునీ చంపేశారు

By Pratap
|
Google Oneindia TeluguNews

మీరట్: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గ్రామంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో ఓ మహిళ ముఖంపై, ఛాతీపై పది బుల్లెట్లను పేల్చారు. బుధవారం జరిగిన ఈ సంఘటనలో ఆమె మరణించింది.

ఆమె కుమారుడిని కూడా హత్య చేారు. అతని శవం గ్రామ సమీపంలోని ఓ కారులో పడి ఉంది. నీచెత్తారు కౌర్ అనే మహిళ తన ఇంటి ఆరుబయట మంచంపై కూర్చుని ఉంది. ఆమె పక్కనే మరోర మహిళ కూడా కూర్చుని ముచ్చట పెడుతోంది.

Mother, son shot dead, day before fathers alleged murder case hearing

ఆ సమయంలో అకస్మాత్తుగా ఓ వ్యక్తి వారి వద్దకు వచ్చి నాటు పిస్టల్‌తో నిచేత్తారు కౌర్ ఛాతిపై రెండు అడుగుల దూరం నుంచి కాల్పులు జరిపాడు. ఆమె మంచంపై పడిపోయింది. ఆ వెంటనే మరో ఇద్దరు వచ్చి ఆమెపై కాల్పులు జరిపారు.

ఆయుధాల్లో దాడి చేసినవారు రీలోడ్ చేసుకుంటుండగా అందులోని ఓ వ్యక్తి రెండో మహిళ వద్దక వచ్చి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పాడు. ఆరు సార్లు కాల్పులు జరిపిన తర్వాత కూడా మహిళలో కదలిక ఉండడంతో కొత్త పిస్టల్‌తో ఒకతను ఆమె తలపై కాల్పులు జరిపాడు. మరో ఇద్దరు కూడా మహిళ ముఖంపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు.

మహిళ ఇంటి బయట అమర్చిన సిసిటీవీ కెమెరాలో ఆ సంఘటన మొత్తం రికార్డయింది. దుండగులు తమ ముఖాలను దస్తీలతో కప్పుకున్నారు. హత్యకు గురైన తన భర్త విచారణకు నిచేత్తారు, ఆమె కుమారుడు బల్వీందర్ గురువారంనాడు సాక్షులుగా హాజరు కావాల్సి ఉంది. భూవివాదంలో అతను 2016లో హత్యకు గురయ్యాడు. ఆ హత్య కేసులో కొందరికి జైలు శిక్ష పడింది.

పాలనా వ్యవహారాల్లో లోపాలకు గాను ఐదురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఓ వ్యక్తిని తాు అరె్టు చేశామని, అతని క్రైమ్ రికార్డు చూసి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు అంటున్నారు. బైకులపై వచ్చిన నిందితులు హత్య చేసిన తర్వాత వాటిని వదిలేసి వెళ్లిపోయారు.

English summary
A woman and her son were shot dead in broad daylight, a day before court hearing of the father, who too was killed about 15 months ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X