వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

థెరిస్సా ఇష్యూ: బీజేపీ మీనాక్షి, నటి దియామీర్జాల మధ్య వాగ్వాదం

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: థెరిస్సా సేవల ఆంతర్యం, లక్ష్యం క్రైస్తవ మతంలోకి మార్పిడిలు చేయడమేనని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యల పైన బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి, సినీ నటి దియామీర్జాల మధ్య బుధవారం వాగ్వాదం జరిగింది. మోహన్ భాగవత్ వ్యాఖ్యలను మీనాక్షి లేఖి సమర్థించారు.

దాని పైన దియా మీర్జా భగ్గుమన్నారు. మీనాక్షి లేఖి సమర్థనను ఖండించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆమె ఓ పోస్ట్ చేశారు. క్రైస్తవ మతంలోకి ప్రజలను తీసుకు వెళ్లడమే తన కర్తవ్యం అని ఒకానొక సందర్భంలో మదర్ థెరిస్సా చెప్పినట్లు మీనాక్షి లేఖి పేర్కొన్నారు.

Mother Teresa issue: Dia Mirza’s ‘Shame on you’ tweet to Lekhi sparks war

ఈ వ్యాఖ్యల పైన దియా మీర్జా స్పందించారు. గర్హించాల్సిన వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యత ఇవ్వడం సిగ్గుచేటు అని ఆమె ట్వీట్ చేశారు. దానికి మీనాక్షి లేఖి కూడా ధీటుగానే స్పందించారు. వాస్తవాలను ఎదుర్కొనే సామర్థ్యం లేని వ్యక్తిగా మీరు సిగ్గుపడాలని లేఖీ తీవ్రంగా స్పందించారు.

కాగా, థెరీసాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌కు శివసేన కూడా మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. ఆయన కొంత నిజమే చెప్పారని ఆ పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో పేర్కొంది. విదేశాల నుంచి మిషనరీలుగా వస్తున్న క్రైస్తవ సంస్థలు మన దేశంలో చాలామందిని క్రైస్తవ మతంలోకి మారుస్తున్నాయని ఆ పత్రికలో పేర్కొంది.

ముస్లింలు కత్తితో బెదిరించి మత మార్పిడి చేస్తే, క్రైస్తవులు డబ్బు, సేవల పేరిట మతమార్పిడిలకు పాల్పడుతున్నారని ఆ శివసేన పేర్కొంది. అయితే, మనమంతా థెరిసా సేవలను గుర్తించామని, ఆమెలాగే చాలామంది కూడా సేవలందించారని, కానీ ఎలాంటి మతమార్పిడిలకు దిగలేదని సామ్నాలో పేర్కొంది.

ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ రాజస్ధాన్‌లోని భరత్ పూర్‌లో జరిగిన ఎన్జీఓ కార్యక్రమంలో నిరుపేదలకు మదర్ థెరిస్సా సేవ అందించడం వెనుకున్న ప్రధాన లక్ష్యం క్రైస్తవ మత మార్పిడేనని అన్నారు. మదర్ థెరిస్సా సేవలు మంచిదే. కానీ వ్యక్తులను క్రైస్తవ మతంలోకి మార్పిడి చేయడానికి సేవను ఆధారంగా చేసుకున్నారని అన్నారు.

English summary
A war of words on Wednesday erupted between actress Dia Mirza and BJP MP Meenakshi Lekhi over the latter supporting RSS chief Mohan Bhagwat’s remark that conversion to Christianity was the main objective behind Mother Teresa’s service to the poor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X