వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళకు మహిళే అండ: తల్లులు పరీక్షహాలులో.. చిన్నారులు పోలీసుల చేతిలో..!

|
Google Oneindia TeluguNews

పోలీసులు అంటే కొందరు చులకన భావంతో చూస్తారు. కానీ వారు నిత్యం ప్రజల రక్షణ కోసం పాటుపడుతారని కొందరు మాత్రమే గ్రహిస్తారు. కష్టాల్లో ఉంటే వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాం. న్యాయం కావాలంటే ముందుగా పోలీస్ స్టేషన్‌నే ఆశ్రయిస్తాం. పోలీసులు కూడా ప్రజలకు అండగా ఉండేందుకే ప్రాధాన్యత ఇస్తారు. ఇక కొన్ని సమయాల్లో పోలీసులు ప్రజలకు ఎంతగా సహాయం చేస్తారో ఈ కథ చదివితే అర్థమవుతుంది. పోలీసులపై ఉన్న మరో అభిప్రాయం తొలగిపోతుంది.

చిన్నారులను లాలించిన మహిళా పోలీసులు

చిన్నారులను లాలించిన మహిళా పోలీసులు

ఓ ఫోటో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఇద్దరు మహిళా పోలీసులు ఇద్దరు చిన్నారులను తమ చేతుల్లో పట్టుకుని లాలిస్తున్నారు. కన్న తల్లి లేని లోటును ఆ మహిళా పోలీసులు తీరుస్తున్నారు. ఇదే ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేస్తోంది. ఇక కథలోకి వెళితే... ఇద్దరు తల్లులు పరీక్ష రాసేందుకు హాలులోకి వెళ్లగా ఆ చంటి పిల్లలను ఇద్దరు మహిళా పోలీసులు లాలించారు. వారిని నిద్రపుచ్చారు. ఈ ఘటన అస్సాంలో చోటుచేసుకుంది.

సోషల్ మీడియాలో ఎమోషనల్ ఫోటో వైరల్

సోషల్ మీడియాలో ఎమోషనల్ ఫోటో వైరల్

అందరి హృదయాలను టచ్ చేసే ఈ ఎమోషనల్ ఫోటో సోషల్ మీడియాను చుట్టేస్తోంది. అస్సాం రాష్ట్రంలోని మంగళదోయ్‌లోని డాన్ బాస్కో హైస్కూల్ వద్ద ఈ దృశ్యం కెమెరా కంటికి చిక్కింది. ఇద్దరు తల్లులు టెట్ పరీక్ష రాసేందుకు పరీక్ష హాలులోకి వెళ్లారు. దీంతో చిన్నారుల ఆలనా పాలనా ఆ మహిళా పోలీసులు చేపట్టారు. ఈ ఫోటోను అస్సాం పోలీసులు తమ అధికారిక ట్విటర్ హ్యాండిల్‌పై పోస్టు చేశారు. తల్లి అనే పదంను వర్ణిచలేమని పోస్టు చేసిన అస్సాం పోలీస్ ఆ మాతృమూర్తి ప్రేమను ఎవరు పంచినా తల్లే అవుతుందని అర్థం వచ్చేలా పోస్టులో రాసుకొచ్చింది.

నెటిజెన్ల హృదయాలను గెల్చుకున్న మహిళా పోలీసులు

ఇక ఈ ఫోటో ట్విటర్‌లో పోస్టు చేయగానే నెటిజెన్లు తమదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. అంతేకాదు పోస్టు చేసిన కొద్ది క్షణాల్లోనే ఈ ఫోటోకు విపరీతమైన షేర్స్ వచ్చాయి. హాలులో పరీక్షలు రాస్తుండగా బయట చంటిపిల్లలను ఎత్తుకుని లాలిస్తున్న ఈ పోలీస్ తల్లులకు హ్యాట్సాఫ్ అంటూ కొందరు కామెంట్ చేశారు. పోలీసులు కేవలం క్రిమినల్స్‌ను పట్టుకోవడానికి మాత్రమే ఉండరని సమాజ సేవలో కూడా భాగస్వాములే అని చెప్పేందుకు ఈ మహిళా పోలీసులే నిదర్శనమంటూ మరికొందరు ట్వీట్ చేశారు.తమ హృదయాలను ఈ ఇద్దరు మహిళా పోలీసులు దోచేశారని మరికొందరు కామెంట్ చేశారు. ఇక కొందరైతే మానవత్వం భూమిపై ఇంకా మిగిలే ఉందని చెప్పారు.


మొత్తానికి తమ డ్యూటీ కాకపోయినప్పటికీ, పిల్లలను మూడుగంటలపాటు ఎత్తుకుని లాలించిన ఈ మహిళా పోలీసులకు నెటిజెన్లు సలాం చేస్తున్నారు. మహిళలకు అండగా మహిళలే ఉంటారనేదానికి ఈ ఫోటోలో ఉన్న మహిళా పోలీసులే నిలువెత్తు నిదర్శనం.

English summary
The two policewomen from Assam looked after infants while their mothers appeared for an examination is making a buzz.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X