వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరోగసీ ద్వారా తల్లైతే, ప్రసూతి సెలవులు ఇవ్వాల్సిందే: హైకోర్టు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

కొచ్చి: సరోగసీ పద్ధతి ద్వారా తల్లైన మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులకు అర్హులంటూ కేరళ హైకోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పు దేశంలో సరోగసీ హక్కులకు ఊతమిచ్చేలా ఉంది. సరోగసి పద్ధతి ద్వారా తల్లైన వారికి కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాలని కేరళ హైకోర్టు ఆదేశించింది.

వివరాల్లోకి వెళితే కేరళ లైవ్ స్టాక్ డిపార్ట్‍‌మెంట్ బోర్డులో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పని చేస్తొన్న గీత తనకు ప్రసూతి సెలవులు నిరాకరించడంపై పెట్టుకున్న పిటిషన్‌పై కేరళ హైకోర్టు మంగళవారం తీర్పునిచ్చింది.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

Mothers raising surrogate babies eligible for maternity leave, Kerala HC rules

గీత ఓ రోడ్డు ప్రమాదంలో తన కొడుకును కోల్పోయింది. తనకు మళ్లీ పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో సరోగసీ పద్ధతి ద్వారా జూన్ 18న తల్లి అయింది. సరోగసీ ద్వారా పుట్టిన బిడ్డ కోసం తనకు ప్రసూతి సెలవులు కోరింది.

బిడ్డను స్వయంగా కనలేదనే నెపంతో సంస్ధ తనకు ప్రసూతి సెలవులు నిరాకరించిందని గీత న్యాయస్ధానానికి తెలిపింది. ఆమె పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ దామా శేషాద్రి నాయుడు సరోగసీ పద్ధతి ద్వారా తల్లైన వారికి కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాలని తీర్పునిచ్చింది.

English summary
Giving a boost to surrogacy rights in the country, the Kerala High Court on Tuesday held that women employees who raise surrogate babies are eligible for maternity leave.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X