వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీస్ స్టేషన్ టేబుల్ మీద చిన్నారి, పాల బుడ్డి, పక్కనే లేడీ పోలీస్, వైరల్, డీజీపీ సెల్యూట్!

|
Google Oneindia TeluguNews

ఆగ్రా: ఉత్తరప్రదేశ్ లోని కోట్వాలి ఝాన్సీ పోలీస్ స్టేషన్ లో తీసిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విధులు నిర్వహిస్తూనే తల్లిగా ఓ బిడ్డకు న్యాయం చేస్తున్న లేడీ కానిస్టేబుల్ నేడు వార్తల్లోకి ఎక్కారు. ఇలాంటి తల్లి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలని స్వయంగా పోలీసు శాఖ డీజీపీ సెల్యూట్ చేస్తూ ఆమెను ప్రశంసలతో అభినందించారు.

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు చెందిన అర్చనా (31)కు వివాహం అయ్యింది. అర్చనాకు 11 ఏళ్ల కుమార్తె ఉంది. ఉత్తరప్రదేశ్ లో ని పోలీసు శాఖలో అర్చనా కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తోంది. అర్చనా భర్త ప్రైవేటు కంపెనీ ఉద్యోగి, ప్రస్తుతం అర్చనా భర్త గుర్ గావ్ లో ఉద్యోగం చేస్తున్నాడు.

Motivational story of a lady cop from Jhansi police station in Uttar Pradesh

ఆగ్రాలో అవ్వాతాత దగ్గర అర్చనా 11 ఏళ్ల కుమార్త నివాసం ఉంటూ స్కూల్ కు వెలుతోంది. 2016లో అర్చనాను ఆగ్రా నుంచి ఝాన్సీ పోలీస్ స్టేషన్ కు బదిలి చేశారు. ప్రస్తుతం కోట్వాలి ఝాన్సీ పోలీస్ స్టేషన్ లో అర్చనా కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తోంది.

ఆరు నెలల క్రితం అర్చనా మరో చిన్నారికి జన్మనిశ్చింది. కుటుంబ, ఆర్థిక సమస్యల కారణంగా అర్చనా ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగానికి వెళితే ఇంటిలో చిన్నారి ఒంటరిగా ఉంటుందని, ఆమెను చూసుకునే వారు ఎవ్వరూ ఉండరని భావించిన అర్చనా పాపను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లింది.

పోలీస్ స్టేషన్ లో పాపకు పాల బుడ్డీతో కడుపునిండా పాలు తాగించిన అర్చనా ఓ టేబుల్ మీద చిన్నారిని నిద్రపుచ్చింది. తరువాత అర్చనా తన విధుల్లో నిమగ్నం అయ్యింది. టేబుల్ మీద చిన్నారి నిద్రపోతున్న సమయంలో పక్కనే కుర్చీలో అర్చనా విధులు నిర్వహిస్తున్న సమయంలో తీసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో అప్ లోడ్ కావడంతో అది వైరల్ అయ్యింది.

సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఆ ఫోటో ఉత్తరప్రదేశ్ డీజీపీ ఓపీ. సింగ్ కంటపడింది. అర్చనా వివరాలు తెలుసుకున్న డీజీపీ ఓపీ. సింగ్ వెంటనే అర్చనాను ఆగ్రాకు బదిలి చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. ఆగ్రాలో అర్చనా కుటుంబ సభ్యులు చిన్నారికి తోడుగా ఉండటానికి డీజీపీ ఓపీ. సింగ్ అవకాశం కల్పించారు.

తల్లిగా అర్చనా పాపకు న్యాయం చేస్తోందని, దానితో పాటు ప్రభుత్వ ఉద్యోగానికి న్యాయం చేస్తోందని డీజీపీ ఓపీ. సింగ్ కొనియాడారు. ఉద్యోగానికి, తల్లిగా న్యాయం చేస్తున్న ఇలాంటి అర్చనా మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచిందని, ఆమెకు సెల్యూట్ చేస్తున్నామని డీజీపీ ఓపీ. సింగ్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అర్చనాను అనేక మంది సోషల్ మీడియాలో ప్రశంసలతో అభినందిస్తున్నారు.

English summary
Meet MotherCop Archana posted at kotwali jhansi in Uttar Pradesh for whom the duties of motherhood and the department go side by side. Her photo goes viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X