వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త ట్రాఫిక్ చట్టం ఆదాయ పథకం కాదు... గుజరాత్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన గడ్కరీ

|
Google Oneindia TeluguNews

కొత్త ట్రాఫిక్ చట్టం ఆదాయం కోసం తీసుకువచ్చిన పథకం కాదని, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గతంలో ప్రమాదాల వల్ల సుమారు 1,50,000 మంది చనిపోయారని తెలిపారు. రోడ్ ప్రమాదాల ద్వార చనిపోవారిని రాష్ట్రాలు పట్టించుకోడం లేదంటూ పరోక్షంగా గుజరాత్‌కు చురకలు అంటించారు. గుజరాత్‌ ప్రభుత్వం ట్రాఫిక్ నిబంధనలపై తీసుకున్న నిర్ణయంపై ఆయన స్పందించారు. ఈనేపధ్యంలోనే నూతన మోటారు వాహన చట్టాన్ని సానుకూల దృక్పథంతో అమలు చేయాలని ఆయా రాష్ట్రాలకు నితిన్ గడ్కరీ విజ్ఞప్తి చేశారు,

సర్పంచ్ స్థాయి నుంచి మచ్చ లేని వ్యక్తినంటూ.. మంత్రి పదవి రాక రామన్న కంట తడి..!సర్పంచ్ స్థాయి నుంచి మచ్చ లేని వ్యక్తినంటూ.. మంత్రి పదవి రాక రామన్న కంట తడి..!

కేంద్రానికి షాక్ ఇచ్చిన గుజరాత్

కేంద్రానికి షాక్ ఇచ్చిన గుజరాత్

కొత్త ట్రాఫిక్ నిబంధనలతో ప్రజలు అందోళనకు గురవుతున్న విషయం తెలిసిందే.. కేంద్రం నూతన చట్టాన్ని తీసుకువచ్చిందే తడవుగా వెంటనే ఆ చట్టాన్ని మెజారీటి రాష్ట్రాలు హుటాహుటిన అమలు చేస్తున్నాయి. ఇందుకు విరుద్దంగా బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్ కేంద్రానికి షాక్ ఇచ్చింది. కేంద్రం చేపట్టిన నూతన వాహన చట్టం సవరణ బిల్లును ఆ రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించింది. ఇప్పటికే జరిమానాలపై పలు రాష్ట్రాల్లో ప్రజల నుండి వ్వతిరేకతలు వస్తుండడంతో గుజరాత్ ప్రభుత్వం అలర్ట్ అయింది. ప్రధాని మోడీ స్వంత రాష్ట్రమైనా అక్కడ వ్యతిరేకత రాకుండా ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే గుజరాత్ సీఎం విజయ్ రూపాని ప్రజలకు ఉపశమనం కల్గించే చర్యలు చేపట్టింది.

గుజరాత్‌లో 50శాతం మేర తగ్గించిన జరిమానాలు

గుజరాత్‌లో 50శాతం మేర తగ్గించిన జరిమానాలు

కోత్త ట్రాఫిక్ చట్టంలో కేంద్రం విధించిన జరిమానాలను సగానికి తగ్గించింది. కేంద్రం చట్టాన్ని సవరణ చేస్తూ జరిమానాలను 50 శాతానికి పైగా తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఫైన్ల మోత మోగిస్తుటే.. అదే బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్లో సీఎం విజయ్ రూపానీ జరిమానాలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించారు. ఏకంగా 50శాతం మేర తగ్గించడంతో వాహనదారులు రిలాక్స్ అవుతున్నారు.

గుజరాత్ నిర్ణయంతో షాక్ తిన్న నితిన్ గడ్కరీ

గుజరాత్ నిర్ణయంతో షాక్ తిన్న నితిన్ గడ్కరీ

దీంతో బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు ఢిల్లీ,హర్యాణ, రాజస్థాన్ లాంటీ రాష్ట్రాలు కూడ చట్టాన్ని ఎలాంటీ సవరణలు లేకుండా యధావిధిగా అమలు చేస్తున్నాయి.
ఈనేపథ్యంలోనే గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుజరాత్ నిర్ణయంతో షాక్ తిన్న నితిన్ గడ్కరీ ఇది ఆదాయ పథకం కాదంటూ పేర్కోన్నారు. చట్ట సవరణ చేసేకంటే ముందే అన్ని రాష్ట్రాలను సంప్రదించామని ఆయన వెల్లడించారు.కేంద్రం తీసుకువచ్చిన నిబంధనలతో ఎక్కువ జరిమానాలు వేయడం కేంద్రం లక్ష్యం కాదని అన్నారు. ప్రజలు సురక్షితంగా ఉండాలన్నదే తాము కోరుకుంటున్నామని చెప్పారు.

English summary
Union Minister Nitin Gadkari today appealed to states against softening a new law that calls for steep fines for traffic violations, a day after his own party's government in Gujarat slashed the penalties. "This isn't a revenue income scheme, are you not worried about deaths of 1,50,000 people," the Road Transport minister said, without naming any state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X