వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళలో రేవ్ పార్టీ..మత్తులో సినీ , టీవీ సీరియల్ నటులు..భారీగా డ్రగ్స్ సీజ్, 9 మంది అరెస్ట్

|
Google Oneindia TeluguNews

కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో వాగమోన్ ప్రైవేటు రిసార్ట్ లో రేవ్ పార్టీ పై దాడి చేసిన పోలీసులు 20 మంది మహిళలతో సహా 60 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రేవ్ పార్టీ లో మాదకద్రవ్యాలను వినియోగిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారి నుండి డ్రగ్స్ స్వాధీనం చేసుకొని డ్రగ్స్ వ్యవహారంలో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. రిసార్ట్స్ లో రేవ్ పార్టీ జరుగుతుందని విశ్వసనీయ సమాచారం మేరకు తాము ఈ రైడ్స్ చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు.

వాగమోన్ లోని ఒక రిసార్ట్ లో రేవ్ పార్టీ .. భారీగా డ్రగ్స్ సీజ్

వాగమోన్ లోని ఒక రిసార్ట్ లో రేవ్ పార్టీ .. భారీగా డ్రగ్స్ సీజ్

కొండప్రాంతమైన వాగమోన్ లోని ఒక రిసార్ట్ లో ఒక రేవ్ పార్టీపై దాడి చేసిన పోలీసులు వారి వద్ద నుండి పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే వారిలో చాలామంది మత్తులో ఉన్నారు. వారి వద్ద నుండి ఎస్టసీ టాబ్లెట్ లు, పౌడర్, చరాస్ , హాషిష్ , ఎల్ఎస్డి, మేత్ క్రిస్టల్, గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా ఇడుక్కి జిల్లా పోలీస్ చీఫ్ ఆర్ కురుప్పు స్వామి వెల్లడించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో కొందరు సినిమా మరియు టీవీ పరిశ్రమ తో సంబంధమున్న వారిగా తెలుస్తుంది. అరెస్టైన మరికొందరు బెంగళూరుకు చెందిన టెక్కీలు గా చెప్తున్నారు.

స్థానిక సిపిఐ నాయకుడికి చెందిన రిసార్ట్స్ లో రేవ్ పార్టీ .,. అశ్లీల నృత్యాలు

స్థానిక సిపిఐ నాయకుడికి చెందిన రిసార్ట్స్ లో రేవ్ పార్టీ .,. అశ్లీల నృత్యాలు

వారందరికీ రక్త పరీక్షలు నిర్వహిస్తామని ఇతరత్రా ఫార్మాలిటీలు పూర్తిచేసిన తరువాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఇడుక్కి జిల్లా పోలీస్ బాస్ వెల్లడించారు. స్థానిక సిపిఐ నాయకుడు అయిన రిసార్ట్ యజమాని పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇది సీపీఐ నాయకుడు షాజీ కుట్టక్కడ్ దని పోలీసులు చెప్పారు.మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి రేవ్ పార్టీలు ఇటీవల బాగా పెరిగిపోయాయని తమకు ఇంటెలిజెన్స్ నివేదికలు ఉన్నాయని, వారు డార్క్ నెట్ చాటింగ్ ద్వారా ఈ రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు.

మొత్తం 60 మంది పార్టీలో .. అందులో 20 మంది మహిళలు

మొత్తం 60 మంది పార్టీలో .. అందులో 20 మంది మహిళలు

ఇడుక్కి జిల్లా పోలీసు చీఫ్ ఆర్ కరుప్పుస్వామి పర్యవేక్షణలో జరిగిన ఈ దాడిలో పోలీసులు రేవ్ పార్టీ లో మహిళల అశ్లీల నృత్యాలే కాదు, మాదకద్రవ్యాలను తీసుకోవడం చూసి షాక్ కు గురయ్యారు. మొత్తం 60 మంది పాల్గొన్న ఈ పార్టీలో 20 మంది మహిళలు ఉన్నారు. చలనచిత్ర, టీవీ పరిశ్రమ కు సంబంధించిన వారు ఉండడంతో వారి పేర్లు బయటకు రాకుండా తెగ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.

ఇదే తరహాలో రేవ్ పార్టీలకు అడ్డాలుగా మారుతున్న చాలా రిసార్ట్స్ మీద ఆకస్మిక దాడులు జరపాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం

English summary
At least 60 persons, including 20 women, were caught in a rave party in a resort Wagamon, in Idukki district and also seized huge drugs from them .Some of those said to be associated with the cinema and TV serial industry
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X