వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాక్సిడెంటల్ పిఎం: మన్మోహన్‌పై సినిమా

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ప్రస్తుత రాజకీయాల్లో నెగ్గుకు రావాలంటే మామూలు విషయం కాదు. పదునైన వ్యాఖ్యలతో ప్రత్యర్థులను కట్టడి చేసే నేర్పుండాలి. మాట తీరుతో జనం దృష్టిని ఆకర్షించాలి. అన్నింటికి మించి పనితీరుతో ప్రమోన్స్ కొట్టేస్తూ.. అంచెలంచెలుగా పైకి ఎదగాలి.

ఇందులో డబ్బు, పలుకుబడి కూడా ప్రధాన పాత్ర పోషించవచ్చు. కానీ ఎలాంటి బలమైన రాజకీయ నేపథ్యం, పలుకుబడి లేకుండా కనీసం మాస్ లీడర్ అన్న ట్యాగ్ లైన్ కూడా లేకుండా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయిన ఒకే ఒక్క వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.

'ఏదైనా రాష్ట్రానికి సీఎం అవ్వాలంటేనే దాని వెనుక కొన్నేళ్ల కల, పట్టువదలని ప్రయత్నాలు దాగుంటాయి. కానీ కనీసం ఏ రాష్ట్రానికి సీఎంగా కూడా వ్యవహరించకుండానే భారతదేశానికి పదేళ్లు ప్రధానిగా పనిచేశారు మన్మోహన్ సింగ్. ప్రధాని అయ్యే ముందు రోజు కూడా తన జీవితంలో ఎన్నడూ ఊహించని అనూహ్య పదవిని తాను చేబట్టబోతున్నట్టుగా మన్మోహన్ సింగ్ ఊహించి ఉండరు.'

Movie on Manmohan Singh, 'The Accidental PM'

ఇప్పుడు ఇవే వ్యాఖ్యలతో (వాయిస్ ఓవర్) మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురించి పరిచయం చేస్తూ.. ఆయన జీవిత చరిత్ర తెరకెక్కబోతుంది. సంజయ్ బారు రాసిన 'ది యాక్సిడెంటల్ పీఎం' పుస్తకం ఆధారంగా మన్మోహన్ బయోపిక్ తెరపై దర్శనమివ్వబోతుంది. కాగా, సంజయ్ బారు 2004 నుంచి 2008 వరకు మన్మొహన్ సింగ్ వద్ద మీడియా సలహాదారుగా పనిచేశారు.

సంజయ్ రాసిన పుస్తకాన్నే కథాంశంగా మలుచుకుని సునీల్ బోహ్రా అనే నిర్మాత దీన్ని తెరకెక్కించబోతున్నారు. 2017 చివరికల్లా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని యోచిస్తున్న చిత్ర యూనిట్ ప్రస్తుతం నటీ నటులను ఎంపిక చేసే పనిలో బిజి బిజీగా ఉంది.

కాగా, సినిమాలో మన్మోహన్ పాత్ర కోసం పంజాబ్ కి చెందిన ఓ నటుడిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి టీజర్ ని ఆగస్టు 30న విడుదల చేయాలనుకుంటున్నట్టుగా సమాచారం. ఇకపోతే ఈ టీజర్ కూడా పలువురు కాంగ్రెస్ పెద్దలకు జలక్ ఇచ్చేదిగా ఉండబోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దేశ ప్రధానిగా పనిచేసిన తెలుగు నేత పీవీ నరసింహారావు అంత్యక్రియలను దేశ రాజధానిలో కాకుండా హైదరాబాద్ లో నిర్వహించడం వెనుక ఉన్న వివాదస్పద కారణాలను టీజర్ లో చూపించబోతున్నట్టు తెలుస్తోంది.

మన్మోహన్ సింగ్ చిత్రాన్ని మొత్తం 12 భాషల్లో విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అలాగే చిత్రానికి సంబంధించి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పాత్రల కోసం విదేశీ నటులను ఎంపిక చేసే అవకాశం ఉంది. చిత్రంలో ప్రముఖ నటుడు మనోజ్ బాజ్ పాయ్ ఓ కీలక పాత్రలో కనిపించినున్నట్టు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

English summary
It takes years of labour and exemplary political acumen to even dream of heading a state. But this is the story of a man who possessed neither, and yet went on to become a prime minister. A man, who was unaware even a day before his anointment, that he will be PM of world's largest democracy."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X