వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను కోళ్ల దొంగనా..! ఎన్నికల ర్యాలీలో ఏడ్చిన ఎంపీ ఆజంఖాన్

|
Google Oneindia TeluguNews

ఓ ఎంపీపై దొంగతనం కేసు నమోదు కావడం అంటే మాములు విషయం కాదు. అలాంటిది ఉత్తర ప్రదేశ్ రాంపూర్ ఎంపీ ఆజాంఖాన్ పై పలుసార్లు దొంగతనం కేసులు నమోదయ్యాయి. అది కూడ ఆయన స్వంత నియోజకవర్గంలోనే కావడం విశేషం. దీంతో కేసులను తల్చుకుంటూ ఆజాంఖాన్ ఎన్నికల ప్రచారంలో ఏడ్చాడు. తనపై చీఫ్‌గా కోళ్లు, గొర్రెలు దోంగతనం చేశానని కేసు పెట్టడడంపై ఆయన బోరున విలపించాడు. తాను పశువులను ఎత్తుకెళ్లేవాడిలా కనిపిస్తున్నానా అంటూ ప్రశ్నించాడు.

ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న ఆజాంఖాన్ భార్య

ఉప ఎన్నికల్లో పోటీచేస్తున్న ఆజాంఖాన్ భార్య

రాంపూర్‌లో జరుగుతున్న ఉపఎన్నికల్లో ఎంపీ ఆజాంఖాన్ భార్య తజీన్ ఫాతిమా పోటి చేస్తోంంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఆయనపై వచ్చిన ఆరోపణలపై బోరున విలపించాడు. ఈ సంధర్భంగా ఆయన పబ్లిక్ ర్యాలీలోనే మనోవేదన చెందారు. తనపై పెట్టిన కేసుల నుండి బయట పడేందుకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నారు. కేసులపై సిట్ పోలీసులు విచారణ జరుపుతుండగా ఈ నెల 29న కేసులపై పూర్తి విచారణ కొనసాగనుంది.

ఎంపీపై 80 కేసులు

ఎంపీపై 80 కేసులు

సమాజ్‌వాది ఎంపీ అజాంఖాన్ గత ఎన్నికల ప్రచారం నుండి ఎప్పుడు ఎదో ఒక వివాదంలో చిక్కుకుకుంటు వస్తున్నాడు..దీంతో స్థానికంగా ఆయనపై పలు కేసులు కూడ నమోదయ్యాయి. ఇలా 80 కేసుల వరకు ఆయనపై నమోదయ్యాయంటే అతిశయోక్తికాదు. సాక్ష్యాత్తు లోక్‌సభ డిప్యూటి స్పికర్‌పై కూడ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఆయన క్షమాపణలు చెప్పే వరకు విషయం వెళ్లింది. లైబ్రరీలో పుస్తకాలు దొంగిలించాడని కేసు నమోదు కాగా, దొంగతనం కేసు కూడ నమోదయింది. ఇంట్లో చొరబడి 25000 వేల రుపాయాలతో పాటు పాలిచ్చే గేదేలను దొంగిలించాడని క్రిమినల్ కేసు నమోదైంది.

భూకబ్జా క్రిమినల్స్ లిస్టులో ఆజాంఖాన్ పేరు

భూకబ్జా క్రిమినల్స్ లిస్టులో ఆజాంఖాన్ పేరు

ఆజాంఖాన్ పై నమోదైన కేసుల్లో పలు రకాల కేసులు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా భూకబ్జాల కేసులు ఎక్కువగా ఉన్నాయి. నమోదైన 29 భూకబ్జా కేసుల్లో ముందస్తు బెయిల్ కూడ కోర్టు నిరాకించిన పరిస్థితి నెలకోంది.. ఇాలా ఇప్పటివరకు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులు, పుస్తకాల చోరీ కేసులు, వక్ఫ్ భూముల ఆక్రమణ కేసులు నమోదయ్యాయి. ఇక ఎన్నికల ప్రచారంలో ఆయనపై పోటి చేసిన బీజేపీ అభ్యర్థి, నటి జయప్రదపై కూడ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈసీ కూడ కేసులు నమోదు చేసింది.మరోవైపు తాజాగా మూడు రోజుల క్రితమే రాష్ట్రవ్యాప్తంగా ల్యాండ్ మాఫియా నేరస్థుల ఆన్‌లైన్ లిస్టులో ఆజాంఖాన్ పేరు కూడ చేర్చడం గమనార్హం.

English summary
Samajwadi Party Azam Khan Cries in the Election Rally on theft cases on him.and he has denied the all the allegations made by governament and other private cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X