వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీ కళ్లలోకి చూస్తూ అలానే.... : ప్యానెల్ స్పీకర్‌పై ఎంపీ అజాంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అజాం ఖాన్... రాజకీయ వర్గాల్లో ఈ పేరు చాలా ఫేమస్. ఏదో మంచి పనులు చేసి పాపులర్ కాలేదు... వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఎప్పుడూ ప్రధాన వార్తల్లో నిలుస్తారు. ఇప్పుడు అజాం ఖాన్ గురించి ఎందుకంటారా...? ఈ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎవరిపైనో కాదు ఏకంగా సభ నడిపించే స్థానంలో కూర్చున్న మరో మహిళా ఎంపీ రమాదేవి పై చేశారు.

సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై వాడీవేడీ చర్చ జరుగుతున్న సందర్భంలో మాట్లాడుతూ రమాదేవిని ఉద్దేశించి అజాం ఖాన్ ప్రస్తావించారు. "నీ కళ్లలోకి చూస్తూ మాట్లాడాలనిపిస్తోంది" అంటూ వ్యాఖ్యలు చేసి విమర్శలపాలయ్యారు. వెంటనే రియాక్ట్ అయిన రమాదేవి అలా మాట్లాడటం తగదని అన్నారు. అందుకు అజాం ఖాన్ రమాదేవి తన సోదరితో సమానురాలు అని కవరింగ్ చేశారు. అజాంఖాన్ వ్యాఖ్యలపై ఒక్కసారిగా లోక్‌సభ దద్దరిల్లింది. అజాంఖాన్ క్షమాపణ చెప్పాల్సిందేనంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు.

Recommended Video

వార్డుల విభజన అవకతవకలపై రోడ్డు ఎక్కిన బీజేపీ నేతలు
MP Azam Khan hits headlines for his sexist comments,BJP demands apology

స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లు సభలో లేని సమయంలో రమాదేవి సభను నడిపేందుకు స్పీకర్ ఓంబిర్లా ఈమెను నామినేట్ చేశారు. ఇక సభాపతి స్థానంలో కూర్చున్న ఓంబిర్లా అజాంఖాన్ క్షమాపణ చెప్పాలని ఆదేశించారు. అంతేకాదు ఆయన మాటలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. క్షమాపణ చెప్పాల్సిందిగా బీజేపీ ఎంపీలు డిమాండ్ చేస్తున్న క్రమంలో అజాంఖాన్ తరపున వకాల్తా పుచ్చుకున్న అఖిలేష్ యాదవ్ లేచి మాట్లాడారు.

పదప్రయోగంలో బీజేపీ నేతలు హద్దులు దాటుతారని వారంత నీచంగా మాట్లాడే పార్టీ మరొకటి లేదని అన్నారు. ఇదిలా ఉంటే క్షమాపణ ఎందుకు చెప్పాలని అజాంఖాన్ అన్నారు. తాను మాట్లాడింది తప్పు అని రుజువు చేస్తే తాను రాజీనామా చేసేందుకు సిద్ధమని అన్నారు. ఆ తర్వాత సభనుంచి అఖిలేష్ యాదవ్ అజాం ఖాన్‌లు ఇద్దరూ సభ నుంచి వెళ్లిపోయారు.

English summary
meta descriptionWhile debating on the triple talaq bill in the Lok Sabha on Thursday, Samajwadi Party MP Azam Khan courted a controversy as he told Rama Devi, "Aapki aankhon mein aankhein daalke baat karne ka man karta ha [Feel like speaking to you while looking into your eyes]".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X