వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపటిలోగా బలం నిరూపించుకోండి: మధ్యప్రదేశ్ సర్కారుకు తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి రేపటితో తెరపడనుంది. మధ్యప్రదేశ్‌లోని కమల్ నాథ్ ప్రభుత్వం శుక్రవారం(మార్చి 20) సాయంత్రం 5 గంటలలోగా బలనిరూపణ పరీక్ష ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బలనిరూపణకు ఆదేశించాలంటూ బీజేపీ వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. అంతేగాక, అసెంబ్లీలో బలనిరూపణ పరీక్షను వీడియో తీయాలని ఆదేశించింది.

కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా వారం రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 22 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో మధ్యప్రదేశ్ లోని కాంగ్రెస్ సర్కారు మైనార్టీలో పడిపోయింది.

MP crisis: Kamal Nath Must Face Floor Test By 5 PM Tomorrow, says Supreme Court.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ సర్కారు అసెంబ్లీ బలం నిరూపించుకోవాలంటూ బీజేపీ సవాల్ విసిరింది. అయితే, కాంగ్రెస్ మాత్రం కరోనావైరస్ పేరుతో అసెంబ్లీని వాయిదా వేసింది. దీంతో బలనిరూపణకు ఆదేశాలు జారీ చేయాలంటూ బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారించిన కోర్టు శుక్రవారం కమల్ నాథ్ సర్కారు బలం నిరూపించుకోవాలని స్పష్టం చేసింది. దీంతో రేపు కమల్ నాథ్ ప్రభుత్వం భవితవ్యం తేలనుంది.

Recommended Video

కరోనా వైరస్ : Tollywood Comedian Dr.Bhadram Suggest exercises To Stop కరోనా ! | Oneindia Telugu

కాగా, 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో కాంగ్రెస్ బలం 92కు పడిపోయింది. ఇక బీజేపీకి అసెంబ్లీలో 107 సీట్లున్నాయి. దీంతో అసెంబ్లీలో బలనిరూపణ పరీక్షలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి.. తమ ప్రభుత్వాన్ని నెలకొల్పాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది.

English summary
MP crisis: Kamal Nath Must Face Floor Test By 5 PM Tomorrow, says Supreme Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X