వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎగ్జిట్‌పోల్స్ ఉత్సాహాం... మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ వ్యూహం

|
Google Oneindia TeluguNews

Recommended Video

Exit Polls 2019 : మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ వ్యూహం..!! || Oneindia Telugu

2019 ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు అధికార ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా రానుండడంతో దేశంలోని వివిధ రాష్ట్ర్రాల్లో రాజకీయాలు రసకందాయకంలో పడనున్నాయి. ఈనేపథ్యంలోనే బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నఆయా రాష్ట్ర్రాల్లో తిరిగి అధికారం సాధించేందుకు పావులు కదుపుతోంది.ఇందులో భాగంగానే ఇతర ప్రభుత్వాలను కూలదోసేందుకు సన్నద్దమవుతోంది.

రాష్ట్ర్రాల్లో అధికారం కోసం పావులు కదుపుతున్న బీజేపీ

రాష్ట్ర్రాల్లో అధికారం కోసం పావులు కదుపుతున్న బీజేపీ

కేంద్రంలో బీజేపీ స్వీప్ చేయనుండటంతో మధ్యప్రదేశ్‌‌లో కూడ తిరిగి అధికారం చేపట్టేందుకు సన్నద్దమవుతోంది. ఇందుకోసం మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మైనారీటిలో ఉందంటూ బీజేపీ రాష్ట్ర శాఖ ఆ రాష్ట్ర్ర గవర్నర్ అనందిబెన్ పటేల్‌కు లేఖ రాసింది.దీంతోపాటు ప్రభుత్వం యొక్క బలాన్ని నిరూపించుకునేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని గవర్నర్‌ను కోరింది.

ఎంపీలో 2018లో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం

ఎంపీలో 2018లో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం

కాగా గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుండి ఎస్సీ,బీఎస్పీ పార్టీల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ కమల్‌నాథ్ ముఖ్యమంత్రిగా అధికారాన్నిచేజిక్కించుకుంది.కాగా గత ఎన్నికల్లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీకి 114 బీజేపీకి 109 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నాయి. దీంతో నలుగురు ఇండిపెండెంట్ అభ్యర్థులతోపాటు ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, ఒకరు ఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థుల సపోర్టుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు.

ప్రభుత్వం మైనారీటీలో ఉందంటూ గవర్నర్ కలిసిన బీజేపీ

ప్రభుత్వం మైనారీటీలో ఉందంటూ గవర్నర్ కలిసిన బీజేపీ

ఇక ఈ పరిణామాలు రాత్రీకి రాత్రే జరిగినవి కావని ,గత మూడు నెలలుగా జరుగుతున్న పరిణామాలని ప్రతిపక్ష నేత బీజేపీ నాయకుడు అయిన హితేష్ బాజ్‌పాయ్ స్పష్టం చేశారు. ప్రభుత్వం తనకు తాను పడిపోతుందని కాని అది గంటల్లో జరిగే అవకాశాలు లేకపోయినా ప్రభత్వం పడిపోవడం ఖాయమని హితేష్ బాజ్‌బాయ్ ట్విట్టర్ వేదికగా పేర్కోన్నారు. ఈనేపథ్యంలోనే ఆయన సారధ్యంలో గవర్నర్ ను కలసి లేఖ అందించారు.

ప్రస్థుతం 25 ఎంపీ స్థానాలను గెలుచుకోబోతున్న బీజేపీ

ప్రస్థుతం 25 ఎంపీ స్థానాలను గెలుచుకోబోతున్న బీజేపీ

కాగా ప్రస్థుత పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రాష్ట్ర్రంలోని మొత్తం 29 పార్లమెంట్ స్థానాలకు గాను ప్రస్థుత ఎగ్జిట్‌పోల్స్‌లో 25 స్థానాలకు పైగా గెలుచుకోబోతున్నట్టు ఫలితాలు వెలువడ్డాయి. దీంతో అటు కేంద్రంలో కూడ బీజేపీ అధికారంలోకి రాబోతుండడంతో రాష్ట్ర్రంలో కూడ పావులు కదుపుతోంది. దానికి మధ్యప్రదేశ్‌ పాగ వేసేందుకు ఇదే సమయంగా బీజేపీ భావిస్తోంది. కాగ 2014లో కూడ బీజేపీకి 27 సీట్లను గెలుపోందగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం అధికారానికి దూరమైంది.

English summary
The BJP in Madhya Pradesh has written to Governor Anandiben Patel, claiming that the Congress government is in minority and asking for a special session.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X