వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీచర్లకు పరీక్ష : విద్యార్థులు తప్పడంతో ఎంపీ సర్కార్ నిర్ణయం, టీచర్లు తప్పితే పెనాల్టీ కూడా ..

|
Google Oneindia TeluguNews

భోపాల్ : విద్యార్థులు పరీక్ష తప్పడం అక్కడి టీచర్ల పాలిట శాపమైంది. అధికసంఖ్యలో స్టూడెంట్స్ ఫెయిలవడంతో అక్కడి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎస్సెస్సీ, ఇంటర్ విద్యార్థులను పోలిన పరీక్ష నిర్వహించాలని డిషిసన్ తీసుకుంది. అంతేకాదు ఇందులో ఉపాధ్యాయులు సాధించే మార్కుల ఆధారంగా గ్రేడ్లు కూడా ఇస్తారు. ఇక పరీక్ష తప్పారో అంతే పెనాల్టీ తప్పదని హెచ్చరిస్తున్నారు.

పరీక్ష తప్పారు ..

పరీక్ష తప్పారు ..

మధ్యప్రదేశ్‌లో ఈ నెల 15న పది, పన్నెండో తరగతి పరీక్ష ఫలితాలు విడులయ్యాయి. అయితే దాదాపు 700 స్కూళ్లలో విద్యార్థులు ఫెయిలయ్యారు. ఈ స్థాయిలో ఫెయిలవడం ఏంటనే ప్రభుత్వ వర్గాలు చర్చించాయి. అసలు విద్యార్థుల ఫెయిలవడానికి కారణం ఏంటనే అంశంపై చర్చించి .. ఉపాధ్యాయులకే పరీక్ష పెట్టాలని నిర్ణయం తీసుకుంది.

బాధ్యత మీదే ..

బాధ్యత మీదే ..

700 స్కూళ్లలో దాదాపు 30 శాతం మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. దీంతో విద్యాశాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. వీరి ఫెయిలవడానికి 3500 మంది టీచర్లే కారణమని నిర్ణయానికి వచ్చింది. పది, పన్నెండో తరగతి పోలిన ఎగ్జామ్ టీచర్లకు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆయా స్కూళ్లలో పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ పరీక్ష నిర్వహించామని మధ్యప్రదేశ్ విద్యాశాఖ స్పష్టంచేసింది. ఇందుకోసం ఏర్పాట్లు కూడా చేశామని .. జూన్ 12 పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది.

తప్పారో .. పెనాల్టీ

తప్పారో .. పెనాల్టీ

పరీక్ష అనగానే ఆశామాషీగా ఉండబోదు. ఆ ఉపాధ్యాయులు మళ్లీ ప్రిపేర్ అయి పరీక్ష రాయాల్సిందే. ఎందుకంటే వారు రాసిన పేపర్లను కూడా వాల్యుయేషన్ చేస్తారు. అందులో వారి ప్రతిభను గుర్తిస్తారు. పరీక్షలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా గ్రేడ్లను ఇస్తారు. ఒకవేళ ఏ ఉపాధ్యాయుడైనా ఫెయిల్ అయ్యాడో ఇక పెనాల్టీ తప్పదు. వారి సర్వీసుకు ఇబ్బంది కలిగే పెనాల్టీ ఉంటుందని విశ్వసనీయంగా తెలిసింది. మొత్తానికి విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలవడం .. ఆ ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారింది. మరోవైపు మధ్యప్రదేశ్ సర్కార్ నిర్ణయాన్ని మేధావులు స్వాగతిస్తున్నారు. ఆ టీచర్లే తొలుత చొరవ తీసుకొని ఉంటే .. ఆ స్థాయిలో స్టూడెంట్స్ ఫెయిలయ్యేవారు కాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

English summary
The results of the ten and twelfth class examinations were released on March 15 in Madhya Pradesh. However, in nearly 700 schools, students were founed be failed. Government sources have discussed what is at this level. The reason for the student's failed is to discuss the matter and make the decision to examine the teachers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X