ఈవీఎం టాంపరింగ్‌లో ఎంపీ కవిత సెన్సేషనల్ కామెంట్స్
ప్రస్తుత ఎన్నికల ప్రక్రియలో ఫలితాలు వెలువడిన వెంటనే ఈవీఎంలపై పలు పార్టీలు అనుమానాలు వ్యక్తం చేయడం పరిపాటిగా మారింది. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం కూడా జేడీఎస్, కాంగ్రెస్ నేతలు ఈవీఎంలపై సందేహాలను వ్యక్తం చేశారు. అంతేకాకుండా బీజేపీ టాంపరింగ్‌కు పాల్పడిందని ఆరోపణలు చేశారు. తాజాగా ఈవీఎంల టాంపరింగ్‌పై టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆసక్తికరమైన కామెంట్లు చేశారు.

ఎన్నికల్లో ఈవీఎంల టాంపరింగ్ అసాధ్యం అని కవిత వ్యాఖ్యలు చేశారు. ప్రతీ ఎన్నికల్లోనూ ఇలాంటి ఆరోపణలు వినిపిస్తుంటాయి. ఓడిన పార్టీలే ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తాయి అని ఆమె అన్నారు. కర్ణాటక ఓటర్లు తాజా ఎన్నికల్లో సరైన తీర్పునే ఇచ్చారని కవిత ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.












Click it and Unblock the Notifications