కట్టలు తెంచుకున్న ఆగ్రహం: రాళ్ల వర్షం కురిపించిన వలస కూలీలు
భోపాల్: కరోనావైరస్ లాక్‌డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి, సొంత గ్రామాలకు వెళ్లే పరిస్థితి లేక, తినడానికి తిండి లేక కడుపు మంటతో ఉన్న ఆ కార్మికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో తమను సొంత గ్రామాలకు పంపాలంటూ, ఆహారం ఇవ్వాలంటూ రహదారిపై భారీ ఆందోళన చేపట్టారు.
మధ్యప్రదేశ్-మహారాష్ట్ర సరిహద్దులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉన్న బార్వానీ జిల్లాలోని రహదారిపైకి వేలాదిగా వచ్చిన వలస కూలీలు.. ఆగ్రహంతో రెచ్చిపోయారు. అక్కడేవున్న పోలీసులపైకి రాళ్లు రువ్వారు. తమను సొంత గ్రామాలకు పంపాలంటూ ఆందోళన చేపట్టారు.

ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు చెందినవారే ఈ కూలీల్లో ఎక్కువగా ఉన్నారు.
కాగా, ప్రభుత్వం ప్రకటించిన శ్రామిక్ ట్రైన్లలో వెళ్లేంత ఆర్థిక స్తోమత తమకు లేదని, కాబట్టి తమను బస్సుల్లో ఇంటికి పంపించాలంటూ డిమాండ్ చేశారు.
#WATCH Madhya Pradesh: Migrant workers create ruckus near Madhya Pradesh-Maharashtra border in Barwani, demanding arrangement of buses to send them to their native places in Uttar Pradesh & Bihar. Barwani District Collector Amit Tomar says, "We're arranging buses for them". pic.twitter.com/O6e80Dgz6s
— ANI (@ANI) May 14, 2020
అంతేగాక, రోడ్డు మీద వెళ్లే వాహనాలపైనా రాళ్లు విసిరారు. ఈ క్రమంలో భారీగా పోలీసులు మోహరించారు. జిల్లా కలెక్టర్ వారికి బస్సులు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో వలస కూలీలు ఆందోళన విరమించారు.