వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోర్న్‌సైట్లతో లైంగిక నేరాలు: రద్దు చేయాలని కేంద్రానికి మంత్రి లేఖ

By Narsimha
|
Google Oneindia TeluguNews

భోపాల్: పోర్న్ సైట్ల వల్ల లైంగిక నేరాలు పెరుగుతున్నాయని, వీటిని నిషేధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి భూపేంద్రసింగ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

పోర్న్‌కు బానిస: తల్లిపై అత్యాచారయత్నం, అందరి ముందే అశ్లీల చిత్రాల వీక్షణ పోర్న్‌కు బానిస: తల్లిపై అత్యాచారయత్నం, అందరి ముందే అశ్లీల చిత్రాల వీక్షణ

మైనర్లపై రేప్‌లకు పాల్పడే నిందితులకు ఉరిశిక్షను మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు.ఈ విషయాన్ని మంత్రి భూపేంద్రసింగ్ ఆ లేఖలో ప్రస్తావించారు. తమ ప్రభుత్వం గత ఏడాది నవంబర్ నుండి ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చిందన్నారు.ఇదే తరహ చట్టాన్ని కేంద్రం ఇటీవలనే తెచ్చిందన్నారు.

MP minister blames porn sites for fuelling rapes, asks Centre to take steps

బాలికలపై దాష్టీకాలకు పాల్పడేవారికి సమాజంలో జీవించే హక్కు లేదని, వారిని కచ్చితంగా ఉరి తీయాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు.పోర్న్ వెబ్ సైట్లను తక్షణం నిషేధించాలని ఆయన లేఖలో డిమాండ్ చేశారు.

ఈ వెబ్ సైట్లతో ప్రభావితులైన యువకులు అత్యాచారం, లైంగిక వేధింపుల వంటి నేరాలకు పాల్పడుతున్నారని తమ అధ్యయనంలో తేలిందని ఆయన లేఖలో వెల్లడించారు. ఈ కారణంగానే తమ రాష్ట్రంలో తాము 25 పోర్న్ వెబ్‌ సైట్లను నిషేధించామని ఆయన తెలిపారు. సమాజంలో లైంగిక నేరాలు తగ్గించేందుకు వీలుగా పోర్న్ వెబ్‌ సైట్లను వెంటనే నిషేధించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

English summary
The Madhya Pradesh government has asked the Union home ministry to enact a strong law to block pornographic sites, state home minister Bupendra Singh said, blaming such websites for rise in rapes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X