వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లైన మూడో రోజే వధువుకు కరోనా పాజిటివ్: వరుడు సహా కుటుంబసభ్యులంతా క్వారంటైన్లోకి

|
Google Oneindia TeluguNews

భోపాల్: కరోనావైరస్ లాక్‌డౌన్ కొనసాగుతున్నప్పటికీ పలు సడలింపులు ఉండటంతో దేశంలో వివాహాది శుభకార్యాలు జరుగుతున్నాయి. అయితే, ఇలాంటి కార్యక్రమాల్లో భౌతిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడంతో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

 చైనాకు రిలీఫ్-ట్రంప్‌కు షాక్: కరోనావైరస్ సృష్టిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే..? చైనాకు రిలీఫ్-ట్రంప్‌కు షాక్: కరోనావైరస్ సృష్టిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే..?

పెళ్లైన మూడో రోజే వధువుకు కరోనా..

పెళ్లైన మూడో రోజే వధువుకు కరోనా..

వివాహం జరిగిన మూడో రోజునే నవ వధువుకు కరోనా సోకిందని తేలడం కలకలం రేపింది. భోపాల్‌ శివారులోని జాట్ ఖేడీ ప్రాంతానికి చెందిన 25ఏళ్ల మహిళకు మంగళవారం వివాహం జరిగింది. కాగా, అప్పటికే ఆమె కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. తుమ్ములు, జ్వరంతో ఆమె ఇబ్బంది పడుతోంది.

భర్తతోపాటు కుటుంబసభ్యులంతా క్వారంటైన్లోకి..

భర్తతోపాటు కుటుంబసభ్యులంతా క్వారంటైన్లోకి..


ఈ నేపథ్యంలో యాంటీ వైరల్ డ్రగ్ కూడా ఆమె తీసుకుందని ఆమెను పరీక్షించిన వైద్యులు తెలిపారు. మే 16న ఆమె నమూనాలను పరీక్షించిన వైద్యులు ఆమెకు కరోనా సోకిందని తేల్చారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఆమె ఇంటికి వచ్చి ఇంట్లోని భర్త సహా 32 మందిని కూడా క్వారంటైన్ చేశారు. ఆమెను మాత్రం కోవిడ్ ఆస్పత్రికి తరలించారు.

వారంతా భోపాల్, ఇండోర్, గ్వాలియర్లలో చక్కర్లు కొట్టారు..

వారంతా భోపాల్, ఇండోర్, గ్వాలియర్లలో చక్కర్లు కొట్టారు..

ఈ క్రమంలో నవ వధువుకు కరోనా సోకడంతో ఆమె భర్తతోపాటు ఇతర కుటుంబసభ్యులు, బంధువులు, పెళ్లికి హాజరైనవారిలో కలవరం నెలకొంది. కాగా, కొందరు ఆమె కుటుంబసభ్యులు భోపాల్, ఇండోర్, గ్వాలియర్ లాంటి ప్రాంతాల్లో పర్యటించడంతో అధికారులు ఆయా ప్రాంతాల్లోని సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. ఈ ఘటనతో ఇక జరగబోయే పెళ్లిళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Recommended Video

Groom Tied Mobile Phone Instead of Bride's Neck, World First Online Wedding Going Viral
తాజా ఘటనతో ఇకపై పెళ్లిళ్లలోనూ కరోనా స్క్రీనింగ్...

తాజా ఘటనతో ఇకపై పెళ్లిళ్లలోనూ కరోనా స్క్రీనింగ్...


లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో 50 మందికి మించకుండా వివాహాలు లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవాలని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో ఇప్పటికే భోపాల్ నగరంలో 100కుపైగా పెళ్లిళ్లు జరిగాయి. 14వేలకు పైగా పెళ్లిళ్లు డిసెంబర్ నెలకు వాయిదా పడ్డాయి. కాగా, వివాహాలు లాంటి కార్యక్రమాల్లో కూడా హెల్త్ స్క్రీనింగ్ చేయాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 5981 కేసులు నమోదు కాగా, 271 మరణాలు సంభవించాయి. 2844 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

English summary
A bride tested positive for coronavirus on the third day of her marriage on Thursday, triggering panic among newly-married couples and their family members in Madhya Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X