వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో వైరల్: తమాషాగా ఉందా.. సీటుపై రగడ ,విమాన సిబ్బందితో ప్రగ్యాసింగ్ వాగ్వాదం

|
Google Oneindia TeluguNews

Recommended Video

Video of Pragya Singh Thakur Arguing With Passengers On the Flight Went Viral

భోపాల్: వివాదాస్పద బీజేపీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్ మరోసారి కొత్త కాంట్రవర్శీ క్రియేట్ చేశారు. స్పైస్‌జెట్ విమానంలో ప్రయాణిస్తున్న ఆమె లోపల సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆమె సిబ్బందిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. విమానంలో చోటుచేసుకున్న వాగ్వాదం వీడియో సోషల్ మీడియాను చుట్టేస్తోంది. ఆమె ఒక ఎంపీ అని ఆమెను ఇబ్బంది పెట్టడం సరికాదని విమాన సిబ్బందికి ఇతర ప్రయాణికులు చెబుతున్నట్లుగా వీడియోలో వినిపిస్తోంది.

ఇక అసలు విషయంలోకి వస్తే ఢిల్లీ నుంచి భోపాల్ వెళ్లేందుకు ఎంపీ ప్రగ్యా సింగ్ స్పైస్ జెట్ విమానంలో సీటును రిజర్వ్ చేసుకున్నారు. ఆమె 1A సీటును బుక్ చేసుకున్నారు. అయితే సిబ్బంది మాత్రం ఆమెకు మరో సీటును కేటాయించడంపై ప్రగ్యా ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తరహా విమానాల్లో 1A సీటును దివ్యాంగులకు మాత్రమే కేటాయిస్తామని స్పైస్ జెట్ అధికారులు తెలిపారు. ఇక వాగ్వాదానికి దిగడంతో విమానం 45 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది. ఇక భోపాల్‌లో విమానం ల్యాండ్ అవగానే ఆమె నేరుగా స్పెస్‌ జెట్ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ప్రగ్యా ఠాకూర్ తమ విమానంలో ప్రయాణించడం తమకు ఆనందంగా ఉందని చెప్పిన అధికారులు విమానంలోని A1 సీటును ఎమర్జెన్సీ కోసమే కేటాయిస్తామని చెప్పారు. ఇక ఆమె తన సొంత వీల్ ‌చైర్‌లో విమానం వద్దకు వచ్చారని చెబుతూ... ఎయిర్‌లైన్ ద్వారా ఆమె రిజర్వేషన్ చేసుకోలేదని చెప్పారు. ఇది సిబ్బందికి తెలియకపోవడంతో పొరపాటున వాగ్వాదానికి దిగి ఉంటారని స్పైస్ జెట్ యాజమాన్యం చెప్పుకొచ్చింది. అయితే 2Aలోకి మారాల్సిందిగా సిబ్బంది విజ్ఞప్తి చేశారని అందుకు ఎంపీ ప్రగ్యాసింగ్ ఒప్పుకోలేదని చెప్పారు. అయితే సేఫ్టీ ఇన్స్‌స్ట్రక్షన్ డాక్యుమెంట్స్ చూపించాల్సిందిగా సిబ్బందిని కోరారని, సిబ్బంది డాక్యుమెంట్స్ చూపించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసిందని అధికారులు తెలిపారు.

MP Pragya Singh Argues with flight staff, Spicejet flight delayed by 45 mintues

ఇక విమానం బయలుదేరేందుకు ఆలస్యం అవుతుండగా ఇతర ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తూ ఆమెను మరో సీటులోకి మారాల్సిందిగా కోరారు. అయినప్పటికీ ప్రగ్యాసింగ్ మారలేదు. దీంతో ఆమెను కిందకు దించేయాల్సిందిగా మరికొందరు ప్రయాణికులు సిబ్బందిని కోరారు. ఇక చివరకు తన సీటును మారేందుకు ఒప్పుకోవడంతో విమానం 45 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరింది.

English summary
BJP MP Sadhvi Pragya Singh Thakur lodged a complaint with Raja Bhoj Airport (Bhopal) Director against SpiceJet over the allotment of seat in flight and alleged she was mistreated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X