వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవమానించారంటూ... విమానం దిగని ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌... 45ని" ఆలస్యం..!!

|
Google Oneindia TeluguNews

వివాదస్పద భోపాల్ బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ తాను ప్రయాణిస్తున్న విమానంలో నుండి దిగనంటూ ఎయిర్‌పోర్టు అధికారులకు చమటలు పట్టించారు. తానో ఎంపీ అని కూడ చూడకుండా విమాన సిబ్బంది అవమానపరిచారంటూ ఆ విమాన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నిరసగానే గమ్యస్థానానికి చేరుకున్న విమానం నుండి ఉన్నతాధికారులు వచ్చే వరకు దిగకుండా సిబ్బందికి ముచ్చెమటలు పట్టించారు. ఆమె నిరసనతో వెళ్లాల్సిన ఫ్లైట్ 45 నిమిషాల పాటు ఆలస్యంగా బయలుదేరింది.

ఈ నేపథ్యంలోనే ఎంపీ ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ ఆదివారం ఢిల్లీ నుండి భోపాల్‌కు ఓ ప్రముఖ స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌లో బయలుదేరింది. అయితే ప్రయాణ సమయంలో సదరు విమాన సంస్థ సిబ్బంది దురుసుగా వ్యవహరించారని , తాను బుక్‌చేసుకున్న సీటును తనకు కేటాయించలేదని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.

MP PragyaSingh Thakur complained to SpiceJet airlines

దీంతో విమానం బోపాల్‌లో విమానం ల్యాండ్ అయిన తర్వాత విమానం దిగడానికి చాలసేపు నిరాకరించారు. దీంతో సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. దీంతో ఆమెను ఇబ్బందిపెట్టిన సిబ్బందిపై చర్యలు చేపడతామని , హమి ఇవ్వడంతో ఆమె మెత్తబడ్డారు. దీంతో వారికి జరిగిన సంఘటపై ఫిర్యాదు చేసి వెళ్లి పోయారు. కాగా ఎంపీ ఫిర్యాదును పరీశీలించి విచారణ చేపడతామని అధికారులు తెలిపారు.

English summary
MP Pragya Singh Thakur complained to SpiceJet airlines. It was alleged that the crew had misbehaved with her on a flight from Delhi to Bhopal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X