ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Disha in Loksabha: 9 నెలల బాలికపై రేప్.. దోషికి ఉరిశిక్ష వేయరా? రేవంత్ రెడ్డి మైక్ కట్..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లో నవంబర్ 26వ తేదీన జరిగిన దిశ రేప్, హత్య సంఘటన అత్యంత క్రూరమైనది. పోలీసుల వైఫల్యం వల్లే ఈ దుర్గటన జరిగింది. దిశ ఘటనకు ముందు కొన్ని నెలల క్రితం భువనగిరి జిల్లా హాజీపూర్‌లో అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. తల్లి ఒడిలో ఉన్న తొమ్మిదినెలల పసిపాపను ఎత్తుకెళ్లి రేప్ చేశారు. ఆ ఘటనలో సెషన్స్ కోర్టు ఉరిశిక్ష తీర్పు ఇచ్చింది. కానీ ఉరిశిక్షను హైకోర్టు జీవితకాలం శిక్ష మార్చుతూ తీర్పునిచ్చింది అని రేవంత్ రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు.

ముఖ్యంగా సభ దృష్టికి తీసుకొచ్చేది ఏమిటంటే.. తల్లి ఒడిలో నుంచి తొమ్మిది నెలల పసిపాపను ఎత్తుకెళ్లి రేప్ చేసి, చంపిన హంతకుడికి ఉరిశిక్ష విధించకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారు? ఆ దోషికి వెంటనే శిక్ష పడేలా సభ చర్యలు తీసుకోవాలి. నిర్భయ ఘటన జరిగి, నిర్భయ చట్ట వచ్చి 7 ఏళ్లు జరిగినా దోషులకు ఉరిశిక్ష విధించడం లేదు అని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశాడు.

MP Revanth Reddy raises Disha incident in Loksabha

దేశంలో హైదరాబాద్ గానీ, కోయంబత్తూరు గానీ, మరేదైనా ప్రదేశం గానీ.. 2016 నివేదిక ప్రకారం.. రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్‌లో 4 వందలకుపైగా రేప్ కేసులు నమోదయ్యాయి అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతుండగా.. స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం తెలిపారు. నీ ప్రాంతం కాకుండా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. అయితే తాను ప్రసంగాన్ని ముగిస్తాను.. మరో అవకాశం ఇవ్వాలని కోరారు.. రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. మోదీ మన్ కీ బాత్‌లో చాలా విషయాలు అంటూ మొదలుపెట్టగానే మైక్ కట్ చేయడంతో గందరగళం నెలకొన్నది.

అనంతరం హైదరాబాద్ దిశ ఘటనపై స్పీకర్ ఓం బిర్లా విచారాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్‌లో పునరావృతం కాకుండా చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ ఘటన తనను తీవ్రంగా కలిచివేసింది. ఇలాంటి సంఘటనలు మరోసారి పునరావృతం కాకూడదు అని స్పీకర్ అన్నారు.

English summary
MP Revanth Reddy raises Disha incident in Loksabha. He asked to hand victims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X