• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అధికారం కోసం సెక్స్ రాకెట్.. మధ్యప్రదేశ్ స్కాండల్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

|

భోపాల్ : మధ్యప్రదేశ్‌ హాని ట్రాప్ సెక్స్ రాకెట్ డొంక కదులుతోంది. హై ప్రొఫైల్ హనీ ట్రాప్ సెక్స్ రాకెట్‌గా వెలుగుచూసిన ఈ బాగోతం మధ్యప్రదేశ్ రాజకీయాలను షేక్ చేస్తోంది. ఆ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ సింగ్ చేసిన తాజా వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి. అధికారం కోసం సెక్స్ రాకెట్ నడిపి రాజకీయాలను భ్రష్టు పట్టించారని ఆరోపించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ పీఠం దక్కించుకోవడానికి ఆడుతున్న డ్రామా అని కొట్టి పారేసిన ఆయన.. మహిళలను ఈ రీతిగా వాడుకోవడం సరికాదన్నారు.

అధికారం కోసమే ఈ సెక్స్ రాకెట్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే బాంబ్

అధికారం కోసమే ఈ సెక్స్ రాకెట్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే బాంబ్

మధ్యప్రదేశ్ హనీ ట్రాప్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టైంది. దాంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే పెద్ద డ్రామాగా అభివర్ణించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ సింగ్. కమల్ నాథ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర అని కొట్టి పారేశారు. అధికారం పరమావధిగా కొందరు నేతలు మహిళలను వాడుకుంటూ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు అభ్యంతరకరమైన వీడియోలు సృష్టించి రాష్ట్ర మంత్రులను, ఎమ్మెల్యేలను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

తెలంగాణపై టీడీపీ కన్నేసిందా.. కేసీఆర్‌కు చెక్ పెట్టేందుకు చంద్రబాబు రెడీయా?తెలంగాణపై టీడీపీ కన్నేసిందా.. కేసీఆర్‌కు చెక్ పెట్టేందుకు చంద్రబాబు రెడీయా?

సెక్స్ రాకెట్‌ను స్కామ్‌గా అభివర్ణించిన లక్ష్మణ్ సింగ్

సెక్స్ రాకెట్‌ను స్కామ్‌గా అభివర్ణించిన లక్ష్మణ్ సింగ్

మధ్యప్రదేశ్ సెక్స్ రాకెట్‌ను స్కామ్‌గా అభివర్ణించారు లక్ష్మణ్ సింగ్. ఇలాంటి కుంభకోణాలు వేలాది సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. అధికారం దక్కించుకోవడానికి ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికార పీఠం కోసం మహిళలను ఇలా వాడుకోవడం సరికాదని హితవు పలికారు. సీబీఐ దర్యాప్తు చేయించాలన్న బీజేపీ డిమాండ్‌పై ఆయన స్పందించారు. సిట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని.. ఆ రిపోర్ట్ వచ్చాక బీజేపీ నేతలు సంతృప్తి చెందకపోతే సీబీఐ దర్యాప్తు జరుగుతుందని తేల్చి చెప్పారు.

రాజకీయ వర్గాల్లో సంచలనం.. ఆ పార్టీల నేతలే ఇందులో..!

రాజకీయ వర్గాల్లో సంచలనం.. ఆ పార్టీల నేతలే ఇందులో..!

మధ్యప్రదేశ్ సెక్స్ స్కాండల్ దేశవ్యాప్త చర్చకు దారి తీసింది. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న మధ్యప్రదేశ్ సిట్ అధికారులు.. ఈ సెక్స్ రాకెట్ కేవలం రాష్ట్రానికే పరిమితం కాలేదని చెబుతున్నారు. ఇది దేశమంతటా వ్యాపించిందని.. అయితే ఈ కేసులో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలే ఉన్నారని సిట్ ఉన్నతాధికారి సంజీవ్ సమి స్పష్టం చేశారు. దాంతో రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపింది. అదలావుంటే యువతులతో సెక్స్ స్కాండల్ నడిపిన ప్రధాన నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. శ్వేత జైన్, బర్కా సోని, ఆర్తి దయాల్, ఆర్తి దయాల్ డ్రైవర్‌ను కూడా అదుపులోకి తసుకున్నారు. అయితే బర్కా సోని మాజీ కాంగ్రెస్ ఐటీ సెల్ నేత అమిత్ సోని సతీమణిగా గుర్తించారు.

యెల్లో యెల్లో తంగేడు పూలు.. మల్లెను మించిన గునుగు పూలు.. బతుకమ్మ సంబురాలు షురూయెల్లో యెల్లో తంగేడు పూలు.. మల్లెను మించిన గునుగు పూలు.. బతుకమ్మ సంబురాలు షురూ

బీజేపీ ఎమ్మెల్యే ఇంటిలోనే దుకాణం

బీజేపీ ఎమ్మెల్యే ఇంటిలోనే దుకాణం

శ్వేత జైన్ ఎన్జీవో సంస్థ పేరిట భోపాల్‌లో అద్దెకు తీసుకున్న ఇల్లు ఈ కేసులో ట్విస్టుగా మారింది. ఆ ఇల్లు బీజేపీ ఎమ్మెల్యే బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్ నివాసం కావడం గమనార్హం. దాంతో కాంగ్రెస్ నేతలకు అస్త్రం దొరికినట్లైంది. అధికారం చేజిక్కించుకోవడానికి బీజేపీ నేతలు ఇలాంటి చీప్ పాలిట్రిక్స్ చేస్తున్నారనేది వారి వెర్షన్.

మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ట్రాప్

మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ట్రాప్

బీజేపీ ఎమ్మెల్యే ఇల్లు కేంద్రంగా సాగిన ఈ సెక్స్ రాకెట్ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను ట్రాప్ చేసింది. హనీ ట్రాప్‌లో పడ్డవారిని వీడియోలు తీయడం ద్వారా ఈ ముఠా బ్లాక్ మెయిల్‌కు పాల్పడిందనే ఆరోపణలు వచ్చాయి. కోట్లాది రూపాయలు కూడా వసూలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ కేసులో అసలు నిజాలు బయటకొస్తే రాజకీయ నేతల బండారం బయటపడనుంది. మొత్తానికి ఈ సెక్స్ స్కాండల్‌లో సమగ్ర దర్యాప్తు జరుగుతుందా.. లేదంటే రాజకీయ వత్తిళ్లతో మధ్యలోనే నీరుగారుతుందా అనే వాదనలు లేకపోలేదు.

English summary
A mid whispers in political circles that the honey-trap and blackmailing racket busted in Madhya Pradesh was a ploy to destabilise the nine-month old Kamal Nath government, Congress MLA Laxman Singh claimed such use of women to grab power was going on for thousands of years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X