వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం పళని గూటికి చేరిన రెబల్ ఎంపీ, దినకరన్ ద్రోహి, డీఎంకేతో కలిసి ప్లాన్, లేడీ లీడర్ ఫైర్ !

టీటీవీ దినకరన్ కు హ్యాండ్ ఇచ్చిన అన్నాడీఎంకే ఎంపీసీఎం పళనిసామి గూటికి చేరిన ఎంపీ వసంతి మురగేశన్, తప్పు జరిగిందిడీఎంకేతో కలిసి అమ్మ ప్రభుత్వాని కూల్చాలని దినకరన్ ప్లాన్ వేశాడని వసంతి ఫైర్

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు ఎదురు తిరిగి టీటీవీ దినకరన్ గ్రూప్ లోనే ఉంటే కచ్చితంగా 18 మంది రెబల్ ఎమ్మెల్యేలకు పట్టిన గతే మనకు పడుతుందని అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎంపీలు ఆందోళన చెందుతున్నారని తెలిసింది.

అందుకు అద్దంపట్టే విధంగా టీటీవీ దినకరన్ గ్రూప్ లో ఇంత కాలం ఉన్న తెంకసి పార్లమెంట్ నియోజక వర్గం ఎంపీ వసంతి మురగేశన్ శుక్రవారం ఎడప్పాడి పళనిసామి గ్రూప్ లో చేరిపోయారు. దినకరన్ కు హ్యాండిచ్చిన ఎంపీ వసంతి మురగేశన్ శుక్రవారం సీఎం ఎడప్పాడి పళనిసామి ఇంటికి వెళ్లారు.

MP Vasanthi murugesan accuses that TTV Dinakaran alliance with DMK. He wants to dissolve this govt she said.

ఎదో తప్పు జరిగిపోయిందని, ఇక ముందు మీకే మద్దతు ఇస్తానని సీఎం వసంతి మురగేశన్ ఎడప్పాడి పళనిసామికి మనవి చేశారని సమాచారం. అనంతరం సీఎం ఎడప్పాడి పళనిసామి ఇంటి ముందు ఎంపీ వసంతి మురగేశన్ మీడియాతో మాట్లాడుతూ దినకరన్ మీద నిప్పులు చెరిగారు.

అన్నాడీఎంకే పార్టీలోని ఎమ్మెల్యేలలో చీలిక తీసుకు వచ్చి డీఎంకే పార్టీతో కలిసి అమ్మ జయలలిత అధికారంలోకి తెచ్చిన తమిళనాడు ప్రభుత్వాన్ని కుప్పకూల్చాలని టీటీవీ దినకరన్ ప్రయత్నించారని ఎంపీ వసంతి మురగేశన్ ఆరోపించారు. అన్నాడీఎంకే ప్రభుత్వానికి దినకరన్ ద్రోహం చెయ్యాలని కుట్రలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

అన్నాడీఎంకే పార్టీలో మహిళా కీలక నేత అయిన ఎంపీ వసంతి మురగేశన్ మొదటి నుంచి శశికళకు విశ్వసనీయురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కడ అనర్హతవేటు పడుతుందో అనే భయంతో ఎంపీ వసంతి మురగేశన్ సీఎం ఎడప్పాడి పళనిసామి గూటికి చేరారని సమాచారం. ఎంపీ వసంతి మురగేశన్ లాగే మిగిలిన ఎంపీలు అందరూ మా గుటికి వస్తారని ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం వర్గీయులు అంటున్నారు.

English summary
MP Vasanthi murugesan accuses that TTV Dinakaran alliance with DMK. He wants to dissolve this govt she said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X