తండ్రి అక్రమ సంబంధంతో కూతుళ్ల విరక్తి -భర్తను రూ.1.5కోట్లకు అమ్మేసిన భార్య -ప్రేయసికి షాక్
డబ్బు మీద విపరీతమైన ఆశతో కట్టుకున్న భర్తను కరెన్సీ నోట్ల తూకానికి పెట్టిమరీ అమ్మేస్తుందో ఆడది. ఈ కథాంశంతో ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన 'శుభలగ్నం' సినిమా తెలుగునాట సూపర్ హిట్ అయింది. బాలీవుడ్ రీమేక్ లోనూ అదరగొట్టింది. సదరు సినిమా కథలాగే మధ్యప్రదేశ్ కు చెందిన ఓ మహిళ కూడా తన భర్తను రూ.1.5కోట్లకు వదిలేసుకోడానికి సిద్ధమైంది. అయితే ఈ నిజజీవిత గాథలోని భర్త.. 'శుభలగ్నం' షరీఫ్ తజగపతిబాబుకు పూర్తి ఆపోజిట్. భర్తతోపాటు అతని ప్రేయసికీ షాకిచ్చిందా భార్య. వివరాల్లోకి వెళితే..
అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్ -ఒక్కొక్కరి నెత్తిన రూ.70వేల భారం -కాగ్ సంచలన రిపోర్టు -జగన్ సర్కార్ మౌనం

సహోద్యోగినితో సరసాలు..
మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో నివసించే ఓ వ్యక్తి ఉన్నత స్థాయిలో ఉద్యోగం వెలగబెడుతున్నాడు. ఇల్లు, ఇల్లాలూ, పిల్లలు ఉన్నా అదనపు షోకులకు పోయాడు. ఆఫీసులో తనతో పనిచేసే మహిళను అఫైర్ కు ఒప్పించాడు. క్రమంగా భార్యను పట్టించుకోకుండా, ప్రియురాలితోనే సరసాలు, అనధికార సంసారం మొదలుపెట్టాడు. ఈ విషయమై భార్య నిలదీయగా.. ఆమెతో గొడవపడేవాడు. ఇంట్లో అడుగు పెట్టింది మొదలు రాత్రాంతా రచ్చ కొనసాగేది. తండ్రి చేస్తోన్న పని, వ్యవహరిస్తోన్న తీరుతో పిల్లలు సైతం విసుగెత్తిపోయారు..
చైనా భయానక కుట్ర: ఉగ్రవాదులకు నేరుగా సాయం -పట్టుబడ్డ 10 మంది గూఢచారులు -అనూహ్య ట్విస్ట్

కూతుళ్ల ఫిర్యాదుతో బట్టబయలు..
ఇంట్లో ఎదుగుతోన్న ఇద్దరు ఆడపిల్లల ముందే భార్య పట్ల భయానకంగా మాట్లాడుతూ, వ్యవహరించే సదరు వ్యక్తి సమాజం దృష్టిలో మాత్రం జెంటిల్మెన్ లా పోజులు కొట్టేవాడు. తండ్రి అక్రమ సంబంధం కారణంగా ఇంట్లో గొడవలను భరించలేకపోయిన పెద్దమ్మాయి(తనింకా మైనరే) నేరుగా సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అమ్మానాన్నల గొడవల కారణంగా తాను, తన సోదరి ప్రశాంతంగా ఉండలేకపోతున్నామని, చదువు మీద ధ్యాస పెట్టలేకపోతున్నామంటూ బాలిక పోలీసుల ముందు వాపోయింది. ఈ వ్యహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు..
మాళవిక మోహనన్ బ్యూటిఫుల్ ఫోటో గ్యాలరీ.. క్లీవేజ్ షోతో పిచ్చెక్కిస్తున్న బ్యూటీ

ఫ్యామిలీ కోర్టులో కౌన్సిలింగ్..
బాలిక ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ కేసు విచారణను భోపాల్ ఫ్యామిలీ కోర్టుకు బదిలిచేశారు. విచారణలో భాగంగా భార్యభర్తలను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆ వ్యక్తిని తన భార్యతోనే ఉండాలని నచ్చజెప్పడానికి అధికారులు విఫలయత్నం చేశారు. తన ప్రియురాలితోనే ఉంటానని ఆ భర్త తెగేసి చెప్పడంతో ఆమెను కూడా పిలిపించి కౌన్సిలర్లు మాట్లాడారు. వివాహేతర బంధంలో గాఢంగా కూరుకుపోయిన వాళ్లిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని తెగేసి చెప్పారు. వాళ్ల వాగ్మూలాను విని విస్తుపోయిన భార్య చివరికి..

భర్త లవర్కు భార్య షాక్
భర్త ఎంతకూ కలిసుండటానికి ఇష్టపడకపోవడంతో చివరకు భార్య ఓ షరతుపై విడాకులకు అంగీకరించింది. తన భర్తతో కలిసుండాలంటే సదరు మహిళ డబ్బులు చెల్లించాలని కండిషన్ పెట్టింది. అంటే లిట్రల్ గా భర్తను అతని ప్రయురాలికి అమ్మేయాలనుకుంది. ఈ మాట వినగానే భర్త, అతని ప్రియురాలు ఎగిరి గంతేశారు. కానీ నిమిషంలోనే అంతా అవక్కయేలా.. ఖరీదైన ప్లాటుతో పాటు రూ. 1.5 కోట్ల రూపాయలు ఇవ్వాలని భర్త ప్రయురాలిని భార్య డిమాండ్ చేసింది. ఆ నంబర్ విని ప్రియురాలికి షరాఘాతం తగిలినంత పనైంది. సెటిల్మెంట్ క్యాష్ కింద రూ. 27 లక్షలు మాత్రం ఇచ్చుకోగలనని చెప్పుకుంది. అడిగింత డబ్బు చెల్లిస్తేనేగానీ భర్తకు విడాకులు ఇవ్వబోనని భార్య కూడా భీష్మించుకుంది. తనకేమీ డబ్బు పిచ్చి లేదని, ఆడపిల్లల భవిష్యత్తు కోసమే, వారు బాగుండాలన్న ఉద్దేశంతోనే భర్త ప్రయురాలిని డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆ మహిళ చెప్పుకుంది. దీంతో మరికొన్ని రౌండ్ల కౌన్సింగ్ నిర్వహించేందుకు అధికారులు సమాయత్తం అయ్యారు.