వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ ఎంపీలారా.. ఇకనైనా మారండి, లేదంటే కష్టమే.. కాంక్లేవ్‌లో శశిథరూర్ సంచలనం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొందరు కాంగ్రెస్ నేతల వైఖరి మారడం లేదన్నారు ఆ పార్టీ నేత శశిథరూర్. ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయి.. ఈ కఠిన సమయంలోనూ కొందరు ఎంపీలు తమ నియోజకవర్గాలకు వెళ్లడం లేదన్నారు. దీంతో పార్టీపై మరింత ప్రతికూల ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేవారు. తన నియోజకవర్గం తిరువనంతపురానికి తాను తరచూ వెళ్తుంటానని .. అందుకే తనను ప్రజలు విశ్వసించి మూడోసారి గెలిపించారని పేర్కొన్నారు. నిన్న ఢిల్లీలో కాంక్లేవ్ సదస్సులో పాల్గొని ప్రసంగించారు శశిథరూర్

Recommended Video

ఆ నలుగురు ఎంపీలవి పార్టీ ఫిరాయింపులే.. -కళా వెంకట్ రావు
 సరికాదు .

సరికాదు .

ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తరచూ నియోజకవర్గాలకు వెళ్లి ప్రజలతో మమేకం కావాలని సూచించారు. లేదంటే అది వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. గత పదేళ్ల నుంచి తిరువనంతపురం నియోజకవర్గ ప్రజలను తాను తరచూ కలుస్తామని, సమస్యలను పరిష్కరిస్తానని గుర్తుచేశారు. అందుకే వారు తనను మూడోసారి ఎంపీగా గెలిపించారని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ .. ఆ పార్టీ కంచుకోట అమేథీ నుంచి ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఎంతవారైనా ప్రజ సమస్యలను పట్టించుకోకుండే ఓటమి తప్పదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

అహ్మదాబాదు కోర్టుకు రాహుల్ గాంధీ...ఈ సారి ఎందుకొచ్చారో తెలుసా..? అహ్మదాబాదు కోర్టుకు రాహుల్ గాంధీ...ఈ సారి ఎందుకొచ్చారో తెలుసా..?

కలుస్తారు.. ప్లస్ ...

కలుస్తారు.. ప్లస్ ...

ఉత్తర భారతదేశంలో బీజేపీ పార్టీకి చెందిన ఎంపీలకు తరచూ ప్రజలను కలుస్తారని గుర్తుచేశారు. గత ఎన్నికల్లో మాత్రం వారు నరేంద్ర మోడీ పేరు మీద గెలిచారని పేర్కొన్నారు. ఆ ఎంపీల సొంత ప్రభ లేదని చెప్పారు. కానీ వచ్చేసారికి అలాంటి పరిస్థితి ఉండబోదని అందరికీ నొక్కి వక్కానించారు. తిరువంతపురంలో జరిగే ప్రతి వేడుకకు తాను హాజరవుతానని గుర్తుచేశారు. వారి సమస్యను పరిష్కరించేందుకు ముందుంటాని .. అందుకే మోడీ హవా ఉన్న సమయంలో తాను గెలవగలిగానని వెల్లడించారు. కాంక్లేబ్ సదస్సులో ధరూర్ క్లెయింట్స్ మరియు కానిస్టిట్యూట్ అనే అంశంపై మాట్లాడారు.

ఇవీ అంశాలు

ఇవీ అంశాలు

కాంక్లేవ్‌లో ప్రాంతం, రాజకీయ సవాళ్లు, మత విభనజ, రాజకీయ గుర్తింపు, హింస, ఉగ్రవాదం, వేర్పాటువాదం, పరిపాలన, ఆర్థిక వృద్ధి, లింగ నిష్పత్తి, జాతీయ భద్రత, సమాజంలో సంస్కతి, సాంప్రదాయాల మార్పు, ప్రవాసుల జీవన శైలి తదితర అంశాలపై డిస్కస్ చేశారు. ఇందులో భాగంగా థరూర్ పాల్గొని ప్రసంగించారు. ఆక్స్ ఫర్డ్ వర్సిటీ ప్రెస్ విట్ నెస్ రిసర్చర్స్, రాజకీయ నేతలు, అధికారులు, అకాడమిషియన్స్, జర్నలిస్టులు వివిధ అంశాలపై చర్చిస్తారు. ఆసియాను ఆధునికంగా ఎలా తీర్చిదిద్దాలో అనే అంశంపై డిస్కస్ జరుగుతుంది.

English summary
Parliamentarians who have a slightly different relationship with their constituencies and are less frequently seen there have a rough time, according to Congress MP Shashi Tharoor. Speaking at a conclave in Delhi on Thursday,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X