వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ రేప్ ఇన్ ఇండియా కామెంట్లపై దద్దరిల్లిన పార్లమెంట్, క్షమాపణ చెప్పాలని పట్టు, లోక్‌సభ వాయిదా

|
Google Oneindia TeluguNews

Recommended Video

Rahul Gandhi VS Smriti Irani : Watch Video రేప్ ఇన్ ఇండియా ప్రకంపనలు!!

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 'రేప్ ఇన్ ఇండియా' కామెంట్లు పార్లమెంట్‌లో ప్రకంపనలు రేపాయి. రాహుల్ వ్యాఖ్యలపై శుక్రవారం లోక్‌సభ, రాజ్యసభ దద్దరిల్లాయి. మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని మేక్ ఇన్ ఇండియా అని ఎలా అంటారని బీజేపీ సభ్యులు ప్రశ్నించారు. క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. సభకు ఆటంకం కలుగడంతో స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేసిన.. పరిస్థితిలో మార్పు లేకుండా పోయింది. కామెంట్లపై పలుమార్లు సభలో చర్చ జరగని పరిస్థితి నెలకొంది. దీంతో స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభను నిరావధికంగా వాయిదావేశారు.

ఏం జరిగిందంటే..

ఏం జరిగిందంటే..

జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. గురువారం గొడ్డా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. దేశంలో జరుగుతున్న లైంగికదాడుల గురించి రాహుల్ గాంధీ ప్రస్తావించారు. మేక్ ఇన్ ఇండియా కాదు‘రేప్ ఇన్ ఇండియా' అని పేర్కొన్నారు. భేటీ పడావో భేటీ బచావో అని నరేంద్ర మోడీ అంటున్నారు.. బీజేపీ ఎమ్మెల్యేనే లైంగికదాడి చేయడంతో.. ఎవరి నుంచి బాలికలను కాపాడాలని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అధికార బీజేపీ సభ్యులు తప్పుపట్టారు.

మేక్ ఇన్ ఇండియా కాస్త..

మేక్ ఇన్ ఇండియా కాస్త..

ప్రధాని నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని తీసుకొచ్చారని బీజేపీ ఎంపీలు చెప్తున్నారు. ప్రపంచం ముందు భారత్‌ను మంచి స్థితిలో నిలబెట్టే ప్రయత్నం చేస్తుంటే.. రాహుల్ గాంధీ ఇలా మాట్లాడటం సరికాదంటున్నారు. లైంగిక హింస, తక్కువ చేసి మాట్లాడటాన్ని తప్పుపట్టారు.

క్షమాపణ...

క్షమాపణ...

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై లోక్ సభ దద్దరిల్లింది. క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులు డిమాండ్ చేశారు. అంశం లేవనెత్తిన సమయంలో రాహుల్ గాంధీ సభలో లేరు. ఆయన వచ్చాక కూడా సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ ఓం బిర్లా పలుమార్లు సభను వాయిదావేశారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పులేదు. ఇటు రాజ్యసభలో కూడా దుమారం చెలరేగింది. సభను చైర్మన్ వెంకయ్యనాయుడు పలుమార్లు వాయిదావేశారు.

కామెంట్లు సరికాదు

కామెంట్లు సరికాదు

అనుచిత వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ డిమాండ్ చేశారు. మరో కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కూడా వంతపాడారు. రేప్ వ్యాఖ్యలు చేసి రాహుల్ గాంధీ మహిళలను తక్కువ చేశారని ఆమె విమర్శించారు. సభకు క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టారు.

 కనిమొళి.. అలా ఎలా

కనిమొళి.. అలా ఎలా

సభలో ఎంపీ తప్పుగా మాట్లాడితే ఖండించాల్సింది పోయి.. సమర్థించడం సరికాదని స్మృతి ఇరానీ అన్నారు. డీఎంకే ఎంపీ కనిమొళి.. రాహుల్ గాంధీకి మద్దతుగా నిలిచారు. దీనిపై స్మృతి ఇరానీ స్పందిస్తూ.. తప్పుగా మాట్లాడిన సభ్యుడిపై చర్యలు తీసుకోవాలని కోరాలే తప్ప.. పార్టీ నియమాల ప్రకారం నడుచుకోవడం సరికాదన్నారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారు క్షమాపణ చెప్పాల్సిందేనని స్మృతి ఇరానీ తేల్చిచెప్పారు.

వయనాడు నుంచి

వయనాడు నుంచి

రాహుల్ గాంధీ కేరళలోని వయనాడు నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ కంచుకోట అమేథీ నుంచి రాహుల్ గాంధీ ఓడిపోయారు. అమేథీ నుంచి స్మృతీ ఇరానీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

English summary
bJP lawmakers angry with Rahul Gandhi rape in india comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X