వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంఆర్ఎఫ్ 'బాహుబలి', రూ.70 వేల మార్క్ దాటనున్న షేర్స్

బుల్ రన్ లో మార్కెట్ లీడర్ ఎంఆర్ఎప్ మరోసారి బాహుబలిగా నిలిచింది. ముఖ్యంగా రికార్డు స్థాయి లాభాలతో దూసుకుపోతోంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై: బుల్ రన్ లో మార్కెట్ లీడర్ ఎంఆర్ఎప్ మరోసారి బాహుబలిగా నిలిచింది. ముఖ్యంగా రికార్డు స్థాయి లాభాలతో దూసుకుపోతోంది.

మార్కెట్లలో మరోసారి టైర్ స్టాక్స్ కు డిమాండ్ కన్పిస్తోంది. మదుపర్ల కొనుగోళ్ళతో టైర్ సెక్టార్ ఆకర్షణీయంగా ఉంది. దీంతో ఇటీవల భారీ లాభాలతో రికార్డ్ ధరను నమోదు చేసిన బాహుబలి షేర్ ఎంఆర్ఎఫ్ 5 శాతం జంప్ చేసింది.

ఒక దశలో రూ.69,848 వద్ద ఇంట్రా డే గరిష్టాన్ని తాకింది. అంతేకాదు ఎంఆర్ఎఫ్ రూ.70 వేల మార్క్ ను అధిగమించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ రబ్బర్ ధరల క్షీణత , డిమాండ్ పెరిగిన నేపథ్యంలో రబ్బర్ షేర్లపై బుల్లిష్ ట్రెండ్ ను అంచనావేస్తున్నారు.

MRF tyre shares record value in markets

టీవీఎస్ శ్రీచక్ర 7 శాతం ఎగిసి రూ.4169 కు, బాలకృష్ణ ఇండస్ట్రీస్ 6 శాతం దూసుకెళ్ళి రూ.15545 కు చేరగా, సియట్ దాదాపు 4 శాతం ఎగిసి రూ.1519 లను తాకింది. ఇక జేకే టైర్స్ 2.4 శాతం పెరిగి రూ.163 కు చేరగా, అపోలో టైర్స్ 2.2 శాతం బటపడి రూ.248 వద్ద ట్రేడవుతున్నాయి.

బాహుబలి తరహలోనే టైర్లలో ఎంఆర్ఎప్ అత్యధిక విలువ చేయనుంది.ఈ మేరకు షేర్ మార్కెట్ లో ఎంఆర్ఎప్ షేర్లకు ఉన్న విలువ ఆధారంగా ఎంఆర్ఎఫ్ కు తిరుగులేదని నిరూపించుకొంది.

English summary
MRF tyre shares record value in markets, it's share 5 % increased, these shares will be jump Rs.70,000 said market analysists
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X