వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్‌: నివేదికలో ధోనీ, రైనా పేర్లు?

|
Google Oneindia TeluguNews

doni-raina
న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్-6 స్పాట్ ఫిక్సింగ్‌ కుంభకోణానికి సంబంధం ఉన్న ఆరుగురు భారత క్రికెటర్ల పేర్లతో కూడిన నివేదికను మాజీ న్యాయమూర్తి ముకుల్ ముద్గల్ నేతృత్వంలోని విచారణ కమిటీ సోమవారం సుప్రీం కోర్టుకు అందజేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నివేదికలోని ఆరుగురు ఆటగాళ్లలో భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, మరో ఆటగాడు సురేష్ రైనాలు ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెల్లువెత్తున్నాయి.

ఎంఎస్ ధోనీ, సురేష్ రైనాలకు స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌తో సంబంధం ఉందని బుకీ ఉత్తమ్ జైన్ అలియాస్ కిట్టీ త్రిచి రైల్వే ఎస్సీ సంపత్ కుమార్ ముందు వెల్లడించినట్లు సమాచారం. ముద్గల్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కుంభకోణానికి సంబంధించిన ఆరోపణలపై విచారణ చేపట్టింది.

కాగా ఇటీవల జరిగిన ప్రపంచ కప్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన, ప్రస్తుత భారత జట్టులో కొనసాగుతున్న ఆటగాళ్ల పేర్లు కూడా ఈ నివేదికలో ఉన్నట్లు ఓ స్పోర్ట్స్ మేగజైన్ పేర్కొంది. అయితే వారి పేర్లు తెలిపేందుకు మాత్రం ఆ మేగజైన్ రిపోర్టర్ నిరాకరించారు. సుప్రీం కోర్టు వద్ద నివేదిక ఉన్నందు వల్ల ఆ వివరాలను వెల్లడించలేమని ఆయన తెలిపారు.

స్పాట్ ఫిక్సింగ్‌తో సంబంధం ఉన్న వారిలో బిసిసిఐ మాజీ అధ్యక్షునితోపాటు ఆరుగురు ప్రముఖ ఆటగాళ్ల పేర్లు ఆ నివేదికలో ఉన్నట్లు తెలిపారు. ఇద్దరు బుకీలు చంద్రేష్ జైన్, అశ్వని అగర్వాల్‌తో జరిపిన సంభాషణలను పరిగణలోకి తీసుకున్నట్లు నివేదిక తెలిపింది. పలు అంతర్జాతీయ మ్యాచులకు ఇండియా తరపున ప్రాతినిథ్యం వహించిన ఇద్దరు ఆటగాళ్ల పేర్లు కూడా నివేదికలో ఉన్నట్లు రిపోర్టర్ పేర్కొన్నారు. ఆ ఇద్దరు ఆటగాళ్లు ప్రస్తుతం టీమిండియాకు ప్రాతినిథ్యం వహిస్తున్నారని చెప్పారు.

English summary
Indian skipper Mahendra Singh Dhoni and Suresh Raina are among the six capped Indian players named in the Mudgal Panel report, media reports claimed on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X