వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంఎస్పీ కమిటీ ఏర్పాటు, రైతులూ ఇళ్లకు వెళ్లండి: కేంద్రమంత్రి తోమర్, ఆ తర్వాతేనంటూ రైతులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) వ్యవస్థను మరింత పారదర్శకంగా, ప్రభావవంతంగా చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.

'ఎంఎస్పీపై ఈ కమిటీ రాజ్యాంగ బద్ధంగా ఏర్పడనుందని, దీంతో రైతుల డిమాండ్ నెరవేరుతుంది. ఈ కమిటీలో రైతు సంఘాల ప్రతినిధులు ఉంటారుై అని కేంద్రమంత్రి తెలిపారు. ఇక ఆందోళన చేస్తున్న రైతులు "ఇంటికి వెళ్లండి" అని ఆయన కోరారు.

MSP committee to be formed, now go home: Union Agriculture minister, farmers responded.

'మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత, రైతుల ఆందోళనను కొనసాగించడంలో అర్థం లేదు. రైతులు తమ ఆందోళనను విరమించి ఇంటికి వెళ్లాలని నేను కోరుతున్నాను' అని నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు.

2020 నుంచి ఒక వర్గం రైతులు నిరసనలు చేస్తున్న క్రమంలో మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కేంద్రం నిర్ణయించిందని
నవంబర్ 19న ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ చర్యను స్వాగతిస్తూనే తమ వద్ద ఉన్న ఆరు డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చలేదని రైతులు పునరుద్ఘాటించారు. వీటిలో ముఖ్యమైనది ఎంఎస్పీ చట్టపరమైన హామీ కోసం డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. .

వారి ఇతర డిమాండ్లలో ముసాయిదా విద్యుత్ సవరణల బిల్లు, 2020/2021 ఉపసంహరణ, రైతులపై క్రిమినల్ కేసులను ఉపసంహరించుకోవడం, ఎన్‌సీఆర్‌లోని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ 2021లోని పంటల అనంతరం పొలాలను కాల్చే రైతులపై జరిమానా చర్యలకు అవకాశం కల్పించే నిబంధనలను తొలగించడం ఉన్నాయి.

'రైతులు పంట అనంతరం పొలాలను కాల్చడాన్ని నేరంగా పరిగణించరాదని రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. భారత ప్రభుత్వం కూడా ఈ డిమాండ్‌ను అంగీకరించింది' అని నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు.

కేంద్రమంత్రి తోమర్ వ్యాఖ్యలపై సంయుక్త కిసాన్ మోర్చ రైతు నేతలు స్పందించారు.
మొదట ప్రభుత్వం రైతు నేతలతో పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలపై చర్చించాలన్నారు. భారతీయ కిసాన్ యూనియన్ నేత గుర్నామ్ సింగ్ చురుని మాట్లాడుతూ.. ఎంఎస్పీ అవసరం తమకు తెలుసునని, వెంటనే ప్రభుత్వం దీనిపై చట్టం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై చట్టం ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. తమ అన్ని డిమాండ్లపై స్పందించాలని కోరారు.

English summary
MSP committee to be formed, now go home: Union Agriculture minister, farmers responded.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X