వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయ రంగు పులుముకుంటోన్న టీమిండియా జెర్సీ...బీజేపీకి కౌంటర్ ఇచ్చిన ముఫ్తీ

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీర్ : క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా టీమిండియా ధరించిన ఆరెంజ్ జెర్సీ ఇప్పుడు రాజకీయ రంగును పులుముకుంటోంది. జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌పై ట్వీట్ చేశారు. టీమిండియా కాషాయం రంగు జెర్సీలు ధరించడంతోనే ఓటమి పాలైందని ఆమె ట్వీట్ చేశారు. ఆమె ట్వీట్ వెంటనే వైరల్ అయ్యింది. దీంతో జమ్ము కశ్మీర్ బీజేపీ స్పందించింది. మెహబూబా ముఫ్తీ రక్తం పాక్‌ గెలవాలని కోరుకుంటోందని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ రవీందర్ రైనా విమర్శించారు.

Mufti tweet on team India jersey takes a political colour,gives strong counter

Recommended Video

పాజిటివ్ గా ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ

అయితే దీనికి వెంటనే ముఫ్తీ కౌంటర్ ట్వీట్ వేశారు. భారత్‌ ఓటమికి కారణం కాషాయం జెర్సీ ధరించడమే అని తాను చేసిన వ్యాఖ్యలు ఒక జోక్‌లా తీసుకోవాలని.. దాన్ని తాను అంత సీరియస్‌గా ఉద్దేశించి ట్వీట్ చేసినది కాదని ఆమె వివరణ ఇచ్చారు. బీజేపీ తన ట్వీట్‌కు రాజకీయ రంగు అద్దే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు. ఈ చిన్న ట్వీట్‌కు ఇంతలా రియాక్ట్ అవుతున్న బీజేపీ... ఆ పార్టీకి చెందిన నాయకులు ముస్లిం మహిళలపై హిందువులు సామూహిక అత్యాచారం చేయాలని అన్నప్పుడు వీరంతా ఎక్కడ దాక్కున్నారని ప్రశ్నించారు. అంతేకాదు తన ట్వీట్‌పై ఎందకంత రభస చేస్తున్నారని ప్రశ్నించిన ఆమె బీజేపీ నేత చేసిన ట్వీట్లు కనిపించడం లేదా అంటూ మండిపడ్డారు.

అంతేకాదు టీమిండియా జెర్సీపై తాను చేసిన ట్వీట్‌కు కూడా ముఫ్తీ వివరణ ఇచ్చారు. టీమిండియా ఆరెంజ్ జెర్సీ వేసుకోవడం వల్లే ఓటమి పాలైందన్న తన వ్యాఖ్యలు సీరియస్‌గా తీసుకోవాల్సిన పనిలేదని చెప్పారు. మూఢనమ్మకాలను నమ్మే వ్యక్తిగా తనను భావించినప్పటికీ తనకేమీ బాధ లేదని అయితే వరుస విజయాలతో దూసుకెళుతున్న టీమిండియా ఒక్కసారిగా జెర్సీ రంగు మార్చగానే ఓటమి పాలైందని గుర్తుచేశారు.

English summary
As political war breaks out over Team India's uniform, PDP chief Mehbooba Mufti has said she was joking when she blamed the new Orange-blue jersey for the country's loss against England in the cricket World Cup.Mufti Quoted tweeting a report of the expulsion of a Bharatiya Janata Party leader for her "Hindus should gangrape Muslim women" remark, Mehbooba Mufti highlighted how her tweet on the orange jersey got more traction than the statement made by the expelled BJP leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X