వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్క అంబానీ సంపదతో భారత ప్రభుత్వాన్ని 20 రోజులు నడపొచ్చు!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలోనే అత్యంత సంపన్నుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఒక్కడికున్న సంపదతో 20 రోజులపాటు భారత ప్రభుత్వాన్నే నడపొచ్చట. బ్లూమ్‌బెర్గ్ సంస్థ తాజాగా విడుదల చేసిన రాబిన్‌హుడ్ ఇండెక్స్-2018 నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.

ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన వ్యక్తుల సంపదతో ఎన్నిరోజులపాటు ఆయా దేశాల ప్రభుత్వాలను నడిపించవచ్చనే అంశానికి సంబంధించి ఈ సంస్థ కొన్ని ఆసక్తికరమైన లెక్కలు బయటపెట్టింది.

బ్లూమ్‌బెర్గ్ ఏం చెప్పిందంటే...

బ్లూమ్‌బెర్గ్ ఏం చెప్పిందంటే...

సంపన్నుల నికర ఆస్తులను, ఆయా దేశాల ప్రభుత్వాల రోజువారీ నిర్వహణ వ్యయంతో లెక్కగట్టి విశ్లేషించింది. బ్లూమ్‌బెర్గ్ సంస్థ తన రాబిన్‌హుడ్ ఇండెక్స్-2018లో ఇలా 49 దేశాల నిర్వహణ వివరాలను ప్రకటించింది.

ముకేశ్ అంబానీ ఆస్తితో...

ముకేశ్ అంబానీ ఆస్తితో...

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ నికర ఆస్తి రూ.2.59 లక్షల కోట్లు (4,030 కోట్ల డాలర్లు). భారత ప్రభుత్వం రోజువారీ ఖర్చు రూ.12,769 కోట్లు. అంటే అంబానీ ఆస్తితో భారత ప్రభుత్వాన్ని 20 రోజులపాటు నడపవచ్చు.

సైప్రస్‌ ప్రభుత్వాన్ని 441 రోజులపాటు...

సైప్రస్‌ ప్రభుత్వాన్ని 441 రోజులపాటు...

ఇక సైప్రస్‌లో అత్యంత సంపన్నుడైన జాన్ ఫ్రెడరిక్‌సన్ సంపదతో ఆ దేశ ప్రభుత్వాన్ని ఏకంగా 441 రోజులపాటు నడిపించవచ్చట. ఎందుకంటే, సైప్రస్ దేశ జనాభా తక్కువ. పరిమిత వ్యయం కారణంగా అక్కడి సర్కారు రోజువారీ నిర్వహణ వ్యయం కూడా తక్కువే.

 ఆ దేశాల ప్రభుత్వాలను నడపడం కష్టమే...

ఆ దేశాల ప్రభుత్వాలను నడపడం కష్టమే...

జపాన్, పోలండ్, అమెరికా, చైనా దేశాలలో పరిస్థితి వేరు. ఆయా దేశాల్లోని దిగ్గజ సంపన్నులకూ ఆ దేశాల ప్రభుత్వాలను నడిపించడం కష్టమైన పనే. ఎందుకంటే ఆయా దేశాల్లో రోజువారీ ప్రభుత్వ నిర్వహణ వ్యయం చాలా ఎక్కువ.

అలీబాబా జాక్‌మా సంపదతో...

అలీబాబా జాక్‌మా సంపదతో...

ప్రపంచ కుబేరుల్లో 16వ స్థానంలో నిలిచిన అలీబాబా గ్రూప్ చైర్మన్ జాక్‌మా తన సంపదను ఉపయోగించి తమ దేశం (చైనా)లోని కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని కేవలం నాలుగురోజులు మాత్రమే నడుపగలరు.

అమెజాన్ అధినేత సంపదతో...

అమెజాన్ అధినేత సంపదతో...

ఇక ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తన నికర ఆస్తిని కరిగిస్తే.. అమెరికా ప్రభుత్వాన్ని ఐదురోజులు మాత్రమే ఆదుకోగలరని రాబిన్‌హుడ్ ఇండెక్స్ విశ్లేషించింది.

బ్రిటన్, జర్మనీలను కొద్దిగంటలే...

బ్రిటన్, జర్మనీలను కొద్దిగంటలే...

బ్రిటన్‌లోకెల్లా అత్యంత సంపన్నుడు హ్యూ గ్రోస్‌వెనార్. అలాగే జర్మనీలో చూసుకుంటే డైటర్ ష్వార్జ్ అత్యంత సంపన్నుడు. అయినా సరే వీరిద్దరూ తమ అపార సంపదతో ఆ దేశ ప్రభుత్వాన్ని కొద్దిగంటలు మాత్రమే నడిపించగలరట.

 ప్రపంచ స్థూల ఉత్పత్తిలో 1 శాతం వీరి దగ్గరే...

ప్రపంచ స్థూల ఉత్పత్తిలో 1 శాతం వీరి దగ్గరే...

రాబిన్ హుడ్ ఇండెక్స్ 2018 విశ్లేషణ ద్వారా.. ఈ 49 దేశాల్లో సుమారు 91100 కోట్ల డాలర్ల విలువైన సంపద (2018 ప్రపంచ స్థూల ఉత్పత్తిలో 1శాతం) ధనికుల వద్ద పోగుపడి ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని నడపడం అంతా ఆషామాషీ వ్యవహారం కాదని అర్థమవుతుందని బ్లూమ్‌బర్గ్ సంస్థ పేర్కొంది.

English summary
Mukesh Ambani can keep the Indian govt running for 20 days The 2018 Robin Hood Index of Bloomberg estimates that India's richest person, Mukesh Ambani could run the Indian government for 20 days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X