వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

11వ సారి: భారత సంపన్నుడిగా ముకేష్ అంబానీ, సంపదెంతో తెలుసా?, టాప్-10లో వీరే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత కుబేరుడు అనగానే మనకు గుర్తుకు వచ్చే పేరు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ. ఈ ఏడాది కూడా భారత్‌లో అత్యంత సంపన్నుడిగా ముకేష్ అంబానీ మళ్లీ అగ్రస్థానంలో నిలిచారు.

 ముకేష్ అంబానీనే మళ్లీ..

ముకేష్ అంబానీనే మళ్లీ..

2018 సంవత్సరానికి గానూ ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ విడుదల చేసిన ‘భారత సంపన్నుల జాబితా'లో వరుసగా 11వ ఏడాది ముకేశ్ ప్రథమ స్థానంలో ఉన్నారు. ఫోర్బ్స్‌ జాబితా ప్రకారం ఈయన సంపద రూ. 3.49లక్షల కోట్లు. ఈ ఒక్క ఏడాదే ముకేశ్‌ సంపద రూ. 68వేల కోట్లు పెరిగింది.

టాప్ 2,3 స్థానాల్లో అజిమ్, లక్ష్మీ మిట్టల్

టాప్ 2,3 స్థానాల్లో అజిమ్, లక్ష్మీ మిట్టల్

ఈ జాబితాలో విప్రో ఛైర్మన్‌ అజిమ్‌ ప్రేమ్‌జీ రెండో స్థానంలో ఉన్నారు. ఈయన సంపద విలువ రూ. 1.55లక్షల కోట్లు. ఇక రూ. 1.35లక్షల కోట్లతో ఏర్సెలార్‌ మిత్తల్‌ ఛైర్మన్‌ లక్ష్మీ మిట్టల్‌ మూడో స్థానంలో నిలిచారు.

పెరిగిన సంపద

పెరిగిన సంపద

మొత్తం 100 మంది సంపన్నులతో ఫోర్బ్స్‌ జాబితాను విడుదల చేసింది. ఈ ఏడాది వీరి మొత్తం సంపద 492 బిలియన్‌ డాలర్లు. ఈ 100 మంది కుబేరుల్లో 11 మంది సంపద ఈ ఏడాది 1 బిలియన్‌ డాలర్లకు పైగా పెరిగిందని ఫోర్బ్స్ ఇండియా తెలిపింది. ఇక ఈ ఏడాది కేవలం నలుగురు మహిళలు మాత్రమే ఫోర్బ్స్‌ జాబితాలో చోటుదక్కించుకున్నారు. వీరిలో బయోకాన్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా ఒకరు. ఈమె సంపద విలువ రూ. 26వేల కోట్లు. ఈ జాబితాలో కిరణ్‌ 39వ స్థానంలో ఉన్నారు.

మొదటి పదిమంది కుబేరులు వీరే..

మొదటి పదిమంది కుబేరులు వీరే..

1. ముకేష్ అంబానీ(రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌)

2. అజిమ్‌ ప్రేమ్‌జీ(విప్రో)
3. లక్ష్మీ మిట్టల్‌(ఏర్సెలార్‌ మిట్టల్‌)
4. హిందుజా బ్రదర్స్‌(అశోక్‌ లేల్యాండ్‌)
5. పల్లోంజీ మిస్త్రీ(షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్‌)
6. శివ్‌ నాడార్‌(హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌)
7. గోద్రేజ్‌ కుటుంబం(గోద్రేజ్‌ గ్రూప్‌)
8. దిలీప్‌ సంఘ్వీ(సన్‌ఫార్మా ఇండస్ట్రీస్‌)
9. కుమార్‌ బిర్లా(ఆదిత్య బిర్లా గ్రూప్‌)
10. గౌతమ్‌ అదానీ(అదానీ పోర్ట్స్‌).

English summary
Reliance Industries' Chairman Mukesh Ambani has emerged as the richest Indian for the 11th consecutive year with a net worth of USD 47.3 billion, according to Forbes magazine. Ambani is also the year's biggest gainer, adding USD 9.3 billion to his wealth amid the continuing success of his Reliance Jio broadband telco service.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X