వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మఖేష్ అంబానీ దుమ్ము రేపుతున్నాడు..నికర లాభం ఎంతో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఆస్తుల నికర విలువ ఎంతో తెలుసా..? ప్రపంచంలోనే టాప్ 20 ధనికుల్లో ఉన్న ముఖేష్ అంబానీ లాభాలు దాదాపు 50 బిలియన్ డాలర్లుగా ఉందని ఓ నివేదిక వెల్లడించింది. అయితే ఈ క్యాలెండర్ సంవత్సరంలో మే నెలలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు విలువ పడిపోయింది. మే నుంచి ఆగష్టు 7 మధ్యలో 21శాతానికి పడిపోయింది.

ఆగష్టు 7వ తేదీ నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేరు విలువ 21.25 శాతం కోల్పోయి రూ.1,109.40కు చేరుకుంది. ఇది మే నెలలో రూ.1408.85గా ఉన్నింది. ఇక తాజా సమాచారం ప్రకారం ముఖేష్ అంబానీ నికర ఆస్తుల విలువ 48 బిలియన్ డాలర్లుగా ఉందని తెలుస్తోంది. బ్లూంబర్గ్ బిలయనీర్ నివేదిక ప్రకారం ప్రపంచంలోని ధనికుల్లో 17వ స్ధానంలో నిలిచారు.

Mukesh Ambani net worth nears $50 billion, maintains 17th richest person title

ఆగష్టు 31, 2019 నాటికి అంబానీ నికర ఆస్తుల విలువ 48.7 బిలియన్ డాలర్లుగా వెల్లడించింది. అయితే ప్రస్తుతం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ముఖేష్ అంబానీ 12వ స్థానానికి ఎగబాకారు. ఇక ఈ ఏడాది తొలి భాగంలో రిలయన్స్ షేరు ధర ఒక్కసారిగా రూ.1417.50కు చేరుకుంది.

ఈ మధ్యే ముఖేష్ అంబానీ జియో ఇన్ఫోకామ్‌ను బలోపేతం చేసే దిశలో భాగంగా కొన్ని ప్లాన్స్‌ను ప్రవేశపెట్టారు. ఇక చివరిసారిగా లిస్టింగ్‌లో షేర్ ధర రూ.1,253కి చేరింది. సెప్టెంబర్ 5 నుంచి రిలయన్స్ జియో గిగా ఫైబర్‌ను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టనుంది. దీంతో తక్కువ ధరకే ఇంటర్నెట్, సెటాప్ బాక్సును ఇవ్వనుంది రిలయన్స్.

English summary
Mukesh Ambani, the billionaire Chairperson of India’s largest public-listed company Reliance Industries Ltd (RIL), has been in the top 20 wealthiest people in the world for quite some years. Reliance Industries share price plunged more than 21 per cent in the period between May 03 and August 07, 2019.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X