వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రాఫిట్స్ కంటిన్యూస్: రెండో త్రైమాసికంకు రిలయన్స్ లాభాలు ఎంతో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రికార్డు స్థాయిలో రూ.11,262 కోట్లు లాభాన్ని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో 18.34శాతంతో లాభాలు బాటలో పయనించింది రిలయన్స్ ఇండస్ట్రీస్. ప్రీటాక్స్ కంటే ముందు రిలయన్స్ జియో సంస్థ ఒక్కటే జూలై నుంచి సెప్టెంబర్‌ వరకు 21శాతంతో రూ.3,222 కోట్లు మేరా లాభాలు నమోదు చేసినట్లు రిలయన్స్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.9,516 కోట్లు నికరలాభాన్ని నమోదు చేసింది. బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో కంపెనీ ఆర్థికలావాదేవీల సమర్పించిన సమయంలో ఈ వివరాలను రిలయన్స్ సంస్థ దాఖలు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికానికి రిలయన్స్ సంస్థ రూ.9516 కోట్లు నికరలాభంను చూపించింది. ఇక మొత్తం ఆదాయం రూ.1,55,763 కోట్లుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తన నివేదికలో పేర్కొంది. గతేడాది ఇదే సమయానికి ఆదాయం రూ. 1,47,268 కోట్లుగా ఉన్నింది. ఈ సారి 5శాతం పెరుగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక నగదు లాభం 18శాతం పెరిగి రూ.18,305 కోట్లకు చేరింది.

ambani

ఈ త్రైమాసికానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ రికార్డు స్థాయిలో లాభాలను నమోదు చేసిందని ఆ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఆయిల్ నుంచి కెమికల్ చైన్‌ వరకు అన్ని సంస్థలు లాభాల బాట పట్టాయని చెప్పేందుకు ఇదే నిదర్శనమన్నారు అంబానీ. కొత్త భాగస్వాములతో ఆయిల్ నుంచి కెమికల్ వరకు మరింత వృద్ధిని నమోదు చేస్తామని ముఖేష్ అంబానీ తెలిపారు. ఇక రీటెయిల్ రంగం, డిజిటల్ సర్వీసెస్‌లే లాభాలు ఆర్జించిపెట్టాయని రిలయన్స్ సంస్థ పేర్కొంది. రీటెయిల్ రంగం 27 శాతం లాభాలు నమోదు చేయగా... డిజిటల్ సర్వీసెస్ 43శాతం లాభం రికార్డు చేశాయని వెల్లడించింది. అయితే రిఫైనింగ్ మరియు పెట్రోకెమికల్ రంగాల్లో రెవిన్యూ కాస్త తగ్గుముఖం పెట్టిందని వెల్లడించింది.

English summary
Mukesh Ambani-led Reliance Industries consolidated net profit for the quarter ended September touched rise 18.34 per cent year-on-year (YoY) growth touching a record Rs 11,262 crore
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X