వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖేశ్ అంబానీకి భద్రత పెంపు: జడ్ ప్లస్ క్యాటగిరీ, ఐబీ హెచ్చరికలతో

|
Google Oneindia TeluguNews

ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీకి భద్రతను కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఆయనకు థ్రెట్ ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీచేశాయి. దీంతో కేంద్ర హోం శాఖ జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రతను కల్పించింది. ఇదివరకు ఆయన్ జడ్ క్యాటగిరీ భద్రత ఉండేది. ఇప్పుడు జడ్ ప్లస్ క్యాటగిరీ ప్రొటెక్షన్ ఉండనుంది.

ఐబీ హెచ్చరికలతో..

ఐబీ హెచ్చరికలతో..

నిఘా సంస్థ‌లు ఇచ్చిన నివేదిక ప్ర‌కార‌మే ముఖేశ్ భ‌ద్ర‌త‌ను జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీకి పెంచిన‌ట్లు కేంద్రం త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. గ‌తేడాది ముంబైలో గల ముఖేశ్ ఇంటి వ‌ద్ద పేలుడు ప‌దార్థాల‌తో కూడిన వాహ‌నాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో ముఖేశ్ భ‌ద్ర‌త‌పై కేంద్ర ప్ర‌భుత్వం విస్తృతంగా చ‌ర్చ‌లు జ‌రిపింది. ఆ క్ర‌మంలో ఆయ‌న భ‌ద్ర‌త‌ను జ‌డ్ ప్ల‌స్ కేట‌గిరీకి పెంచాల‌ని తాజాగా నిర్ణ‌యం తీసుకుంది.

55 మందితో కూడిన భద్రత

55 మందితో కూడిన భద్రత


జ‌డ్ ప్ల‌స్ కేటగిరీ భ‌ద్ర‌త‌లో భాగంగా ముఖేశ్‌ అంబానీకి 55 మందితో భ‌ద్ర‌త క‌ల్పించ‌నున్నారు. వీరిలో 10 మందికి పైగా ఎన్ఎస్‌జీ క‌మెండోలు ఉంటారు. ఇత‌ర పోలీసు అధికారులు కూడా ఉంటారు.

వీరికి కల్పిస్తారు

వీరికి కల్పిస్తారు


దేశంలో పని, ప్రజాదరణ వల్ల గుర్తింపు పొందిన వారికి భద్రతను కల్పిస్తారు. సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు ఉన్నవారిని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సమాచారం సేకరిస్తోంది. ఐబీ రిపోర్ట్ ప్రకారం హోంశాఖ చర్యలు తీసుకోనుంది. విద్రోహ శక్తుల నుంచి ముప్పును బట్టి ఎక్స్, వై, జెడ్, జెడ్ ప్లస్, ఎస్పీజీ ప్రొటెక్షన్ ఇస్తుంటారు.

ఇలా శిక్షణ

ఇలా శిక్షణ


జెడ్ ప్లస్ సెక్యూరిటీలో 55 మంది ఉంటారు. వీరిలో నిపుణులైన కమాండోలు, ఆయుధ లేకుండా పోరాడేవారు కూడా ఉంటారు. అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు కొందరు జెడ్ ప్లస్ సెక్యూరిటీ పొంది ఉన్నారు.

English summary
home ministry has increased the security cover of industrialist Mukesh Ambani. security cover was ramped up to ‘Z +’ category based on the intelligence agency’s threat perception report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X