వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమాచార గోప్యత, క్రిప్టో కరెన్సీ బిల్లులకు ముకేశ్ అంబానీ మద్దతు-కేంద్రానికి ఊరట

|
Google Oneindia TeluguNews

దేశంలో టాప్ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేష్ అంబానీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో తీసుకొస్తున్న రెండు కీలక బిల్లులకు తన మద్దతు ప్రకటించారు. ప్రతిపాదిత డేటా గోప్యత, క్రిప్టోకరెన్సీ బిల్లులకు మద్దతు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు., మన దేశం అత్యంత ముందుచూపుతో చేస్తున్న ఈ ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు.

భారతీయులు తమ స్వంత సమాచారాన్ని కలిగి ఉండటం, నియంత్రించడం, డిజిటల్ సమాచారం నిల్వ చేయడం,, షేర్ చేయాలనే అంశాలపై కఠిన నిబంధనలను రూపొందించడంలో భారతీయులకు అంబానీ పెద్ద మద్దతుదారుగా ఉన్నారు. వ్యూహాత్మక డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి, రక్షించడానికి దేశాలకు హక్కు ఉందని అంబానీ ఇవాళ తెలిపారు. మన దేశంలో ప్రతీ పౌరుడికీ తన సమాచారాన్ని గోప్యంగా ఉంచుకునే హక్కు ఉందని ముకేష్ వెల్లడించారు.

mukesh ambani supports central governments proposed data privacy, cryptocurrency bills

ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (IFSCA) నిర్వహించిన ఇన్ఫినిటీ ఫోరమ్‌లో తన అభిప్రాయాలు పంచుకున్న అంబానీ... దేశం అత్యంత ముందుచూపుతో ఈ నిబంధనలు, విధానాలను అమలు చేస్తోందన్నారు. ఆధార్, డిజిటల్ బ్యాంక్ ఖాతాలు, డిజిటల్ చెల్లింపుల ద్వారా దేశంలో ఇప్పటికే డిజిటల్ గుర్తింపు యొక్క గొప్ప ఫ్రేమ్‌వర్క్ ఉందని ముకేష్ అన్నారు. మనం సమాచార గోప్యత బిల్లు, క్రిప్టోకరెన్సీ బిల్లుల్ని ప్రవేశపెట్టే దశలో ఉన్నామని,. అంటే సరైన దారిలో ఉన్నామని తాను భావిస్తున్నట్లు ముకేష్ వెల్లడించారు.

Recommended Video

Omicron Variant : Covaxin May Have Edge - ICMR Officials || Oneindia Telugu

చిన్న పెట్టుబడిదారులను కాపాడుతూ క్రిప్టోకరెన్సీలను ఆర్థిక ఆస్తిగా పరిగణించేందుకు ప్రభుత్వం పార్లమెంటులో కొత్త బిల్లును తీసుకురావాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ముకేష్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. డిజిటల్ కరెన్సీలలో పెట్టుబడులకు కనీస మొత్తాన్ని చట్టబద్ధమైన టెండర్‌గా ఉపయోగించడాన్ని నిషేధిస్తూ కేంద్రం చట్టం తీసుకొచ్చే అవకాశాలున్నాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాల అజెండాలో క్రిప్టోకరెన్సీ యొక్క అంతర్లీన సాంకేతికతను మరియు దాని ఉపయోగాలను ప్రోత్సహించడానికి కొన్ని మినహాయింపులు" మినహా అన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను నిషేధించే బిల్లును తీసుకురావడాన్ని కేంద్రం లిస్ట్ చేసింది. క్రిప్టోకరెన్సీ నుంచి వచ్చే లాభాలపై పన్ను విధించడాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ కరెన్సీలపై పూర్తి నిషేధాన్ని కోరుతోంది, ఇది దేశం యొక్క స్థూల ఆర్థిక మరియు ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తుందని భావిస్తోంది.

English summary
reliance group chairman mukesh ambani on today backed data privacy and crypto currency bills which central govt to introduce in these parliament winter sessions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X