వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్ :బిఎస్ పి లో చేరిన ముఖ్తార్ అన్సారీ, అఖిలేష్ టిక్కెట్టు ఇవ్వనందుకే

ముఖ్తార్ అన్సారీ సమాజ్ వాదీ పార్టీ నుండి బిఎస్ పి లో చేరారు. టిక్కెట్టు నిరాకరించడంతో ముఖ్తార్ బిఎస్ పిలో చేరారు. అన్సారీతో పాటు ఆయన సోదరుడు, కొడుకుకు కూడ బిఎస్ పి టిక్కెట్టు కేటాయించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో :ముఖ్తార్ అన్సారీ బిఎస్ పి లో చేరారు.సమాజ్ వాదీ పార్టీలో ఆయనకు టిక్కెట్టు దక్కలేదు.తన పార్టీని సమాజ్ వాదీ పార్టీలో విలీనం చేసినా కాని, న్యాయంజరగలేదు.దీంతో ఆయన సమాజ్ వాదీ పార్టీని వీడి బిఎస్ పిలో చేరారు.

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేరస్థులకు టిక్కెట్లు ఇవ్వబోనని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. ఈ మేరకు ముఖ్తార్ అన్సారీకి ఆయన టిక్కెట్టు ఇవ్వలేదు.

ఉత్తర్ ప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ చీఫ్ గా శివపాల్ యాదవ్ ఉన్న కాలంలో ముఖ్తార్ అన్సారీ తన పార్టీని సమాజ్ వాదీ పార్టీలో విలీనం చేశారు.

ముఖ్తార్ పై అనేక నేరారోపణలు ఉన్నాయి.అయితే ఈ ఆరోపణలురుజువు కాలేదు. అయితే నేర చరిత్ర ఉన్నవారికి టిక్కట్లు ఇవ్వబోనని ప్రకటించిన అఖిలేష్ ఈ మేరకు ముఖ్తార్ కు టిక్కెట్టు ఇవ్వకుండా మొండిచేయి చూపారు.

 బిఎస్ పి లో చేరిన ముఖ్తార్ అన్సారీ

బిఎస్ పి లో చేరిన ముఖ్తార్ అన్సారీ

మొన్నటివరకు సమాజ్ వాదీపార్టీలో ఉన్న ముఖ్తార్ అన్సారీ సమాజ్ వాదీ పార్టీ టిక్కెట్టు దక్కకపోవడంతో పార్టీ మారాడు. సమాజ్ వాదీ పార్టీ నుండి బిఎస్ పి లో చేరారు. బిఎస్ పి ఆయన పెద్దపీట వేసింది. తాను కోరుకొన్న వారందరికి టిక్కెట్లు దక్కించుకొన్నాడు ముఖ్తార్ అన్సారీ.ఈ హమీ మేరకే ఆయన బిఎస్ పి తీర్థం పుచ్చుకొన్నారు.

ముఖ్తార్ కు శివపాల్ అండ

ముఖ్తార్ కు శివపాల్ అండ

ఉత్తర్ ప్రదేశ్ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడిగా శివపాల్ యాదవ్ కొనసాగిన కాలంలో ముఖ్తార్ అన్సారీకి అండగా నిలిచారు. ఈ మేరకు ముఖ్తార్ తన పార్టీని కూడ శివపాల్ అండతోనే సమాజ్ వాదీ పార్టీలో విలీనం చేశారు.ఈ ఎన్నికల్లో ముఖ్తార్ కొన్ని టిక్కెట్లను కూడ డిమాండ్ చేశారు.అయితే తన టిక్కెట్టే దక్కని పరిస్థితి నెలకొంది.దీంతో ముఖ్తార్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. పార్టీలో తనకు అండగా నిలిచిన శివపాల్ లేకుండా పోయారు. పార్టీలో అఖిలేష్ దే పై చేయిగా మారడంతో నిస్సహయస్థితికి గురై పార్టీ మారాడు.

 క్లీన్ ఇమేజ్ కోసం అఖిలేష్ ప్రయత్నం

క్లీన్ ఇమేజ్ కోసం అఖిలేష్ ప్రయత్నం


నేరచరిత్ర ఉన్నవారితో పాటు ఇతరత్రా వ్యవహరాలతో సంబంధాలున్నవారికి టిక్కెట్లు కేటాయించబోనని అఖిలేష్ చెప్పారు.ఆ మేరకు ముఖ్తార్ కు టిక్కెట్టు ఇవ్వలేదు. మరోవైపు చాలా మంది సిట్టింగ్ లకు కూడ ఇదే తరహలో టిక్కెట్లను నిరాకరించారు. మరో వైపు శివపాల్ కు అండగా నిలిచినవారికి కూడ అఖిలేష్ టిక్కెట్లు నిరాకరించారు. తనకు మద్దతుగా నిలిచేవారికి టిక్కెట్లు కేటాయించారు. అదే సమయంలో గెలుపుగుర్రాలకే పెద్దపీట వేశారు.

ముఖ్తార్ పరివారానికి బిఎస్ పి టిక్కెట్లు

ముఖ్తార్ పరివారానికి బిఎస్ పి టిక్కెట్లు

ముఖ్తార్ నాలుగు దఫాలు ఎంఏల్ఏగా విజయం సాధించాడు. ఆయనపై అనేక ఆరోపణలు ఉన్నాయి.అయితే ఏ కేసులో కూడ ఆయనపై నేరం రుజువు కాలేదు. సమాజ్ వాదీ నుండి బిఎస్ పి లో చేరిన ముఖ్తార్ కు బిఎస్ పి మౌ సదర్ టిక్కెట్టును కేటాయించింది.ముఖ్తార్ సోదరుడు సిబఖతుల్లాకు మహమ్మదాబాద్ నుండి, ముఖ్తార్ కుమారుడు అబ్బాస్ అన్సారీలకు గోసి స్థానాలకు బిఎస్ పి కేటాయించింది.తమ పార్టీలో క్రిమినల్స్ ఎవరూ లేరని కూడ బిఎస్ పి ప్రకటించింది.

English summary
muktar ansari joined in bsp .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X