వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సొంతగూటికి ముకుల్ రాయ్..? ఢిల్లీ ఇంటిపై మోడీ, షా పోస్టర్లు మాయం, దీదీ వద్దకు...

|
Google Oneindia TeluguNews

ఇటీవల పార్టీ మారే సమయంలో నేతలు కొత్త పంథా అనుసరిస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్ అయితే ప్రొఫైల్ పిక్‌లో పార్టీ లోగో తీసేస్తున్నారు. ఇటీవల కొందరు అలానే చేస్తున్నారు. మరికొందరు పార్టీ లోగో, నేతల ఫోటోలను ఇళ్ల పైనుంచి తొలగిస్తున్నారు. ఈ రెండో కోవలోకి వెళతారు ముకుల్ రాయ్. ఒకప్పటీ టీఎంసీ నేత మమతా బెనర్జీని ఎదురించి బీజేపీలో చేరారు. కానీ ఇప్పుడు ఆయన ఇంటిపై మోడీ, అమిత్ షా ఫోటోలు మాయమయ్యాయి. దీంతో ఏం జరుగుతుంది అనే చర్చకు దారితీసింది.

 స్కాంతో.. బయటకు

స్కాంతో.. బయటకు

బెంగాల్‌లో శారదా స్కాంలో రాయ్ పేరు రావడంతో టీఎంసీని వీడి బీజేపీలో చేరారు. కానీ ఆయన బెంగాల్‌లో బీజేపీని మరింత బలోపేతం చేశారు. మమత కోటాలో కమలానికి ఒక స్టేటస్ తీసుకొచ్చారు. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 18 సీట్లు గెలిచిందంటే అందులో రాయ్ పాత్ర కీలకం. దీనిని చూసి రాజకీయ విశ్లేషకులే నోరెళ్లబెట్టారు. అయితే బీజేపీలో రాయ్‌కి సముచిత గౌరవం లభించలేదు. ఇప్పటికీ కేంద్ర కమిటీలో సభ్యుడిగా ప్రకటించలేదు. దీంతో ఆయన కినుక వహించారని తెలుస్తోంది.

 టీఎంసీ నేతలతో టచ్

టీఎంసీ నేతలతో టచ్

అయితే బీజేపీ మాత్రం టీఎంసీ నేతలతో రాయ్ సన్నిహితంగా ఉన్నారని.. అందుకే పదవీ ఇవ్వడంలో ఆలస్యమవతోందని పేర్కొన్నారు. తిరిగి టీఎంసీలోకి వెళ్లే వ్యక్తిని కీలక పదవీ ఇచ్చేందుకు పార్టీ ధైర్యం చేస్తుందా అనేది వీరి వాదన. ఇటీవల సబ్యసాచి దత్తా ఢిల్లీ వచ్చారు. అతనిని టీఎంసీ నుంచి రాయ్ బీజేపీలోకి తీసుకొచ్చారు. వచ్చే ఏడాది జరిగే బెంగాల్ ఎన్నికలపై చర్చించాల్సిన సమయంలో.. తిరిగి కోల్ కతా వెళ్లిపోయారు.

Recommended Video

TikTok CEO To India Employees | TikTok కు రాబోయే రోజుల్లో అంతా మంచే జరుగుతుంది, ఉద్యోగులకు భరోసా!
 కవరింగ్..

కవరింగ్..

అతను తిరిగి వచ్చిన తర్వాత ఆస్పత్రి పనిమీద వచ్చారని.. అందుకే కోసమే సడన్‌గా వచ్చారని తెలిపారు. కానీ దీంతో పార్టీ నేతలకు అనుమానం వచ్చింది. ఢిల్లీ 181 సౌత్ అవెన్యూలో గల రాయ్ ఇంటి గోడపై మోడీ, అమిత్ షా, బీజేపీ నేతల పోస్టర్లు లేవు. దీంతో అతని తిరిగి సొంతగూడు (టీఎంసీ)లోకి వెళతాడా అనే అనుమానం కలుగుతోంది.

English summary
Mukul Roy participated in every election meeting held by the party, he is yet to be made an official post holder apart from being a member of the BJP's central committee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X