వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్, మేనకా వెనుకంజ : లీడ్‌లో ములాయం, అఖిలేశ్, వరుణ్

|
Google Oneindia TeluguNews

లక్నో : యూపీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు .. 50కి పైగా స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎస్పీ, బీఎస్పీ కూటమి 10 నుంచి 16 సీట్లలో మాత్రమే లీడ్‌లో ఉండటం ఆ పార్టీకి మింగుడు పడడం లేదు. ఇక విపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం నామమాత్రంగా 1 నుంచి 2 సీట్లలో ప్రభావం చూపిస్తోంది.

రాహుల్ వెనుకంజ ..
కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రాతినిథ్యం వహిస్తోన్న అమేథీలో స్మృతీ ఇరానీ గట్టి పోటీనిస్తోంది. మొదటి రౌండ్‌లో ఆమె దూసుకెళ్లింది. తర్వాత రాహుల్ తన ఓటు షేర్‌ను పెంచుకొన్న .. మళ్లీ వెనకబడ్డారు. కాసేపటి క్రితం స్మృతీ ఇరానీ 7 వేల పైచిలుకు ఓట్లతో దూసుకెళ్తున్నారు. ఇక యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ ఆధిక్యంలో ఉన్నారు. వారణాసిలో మోదీ హవా కొనసాగుతోంది. ఫిలిబిత్‌లో వరుణ్ గాంధీ, అలహాబాద్ నుంచి రితా బహుగుణ తమ ప్రత్యర్థులతో కాస్త ముందంజలో ఉన్నారు. అయితే వరుణ్ తల్లి, కేంద్రమంత్రి మేనకాగాంధీ సుల్తాన్ పూర్ లో తన ప్రత్యర్థి బీఎస్పీ అభ్యర్థి చంద్రభద్ర సింగ్ సోనుపై వెనుకంజలో ఉన్నారు. ఇక కేంద్రమంత్రి, వివాదాస్పద నేత వికే సింగ్ .. ఘజియాబాద్‌లో 34 వేల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.

mulayam, akhilesh, varun lead

ములాయం దూకుడు
ఇక ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మెయిన్ పురి నుంచి మంచి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయనకు పెట్టిన కోట అయిన ఈ స్థానంలో తొలి రౌండ్ నుంచి లీడ్‌లో ఉన్నారు. ఆయన కుమారుడు ఎస్పీ చీఫ్ అఖిలేశ్ అజాంఘర్ లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వాస్తవానికి అజాంఘర్ నుంచి ములాయం పోటీ చేయాలనుకొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మెయిన్ పురి నుంచి ములాయం .. అజాంఘర్ నుంచి అఖిలేశ్ బరిలోకి దిగారు. అయితే ఎస్పీ- బీఎస్పీ కూటమిగా ఏర్పడి మెజార్టీ సీట్లలో ప్రభావం చూపకపోవడం ఆ పార్టీకి కాస్త ఆందోళనకు గురిచేస్తోంది.

English summary
With the results to the crucial Uttar Pradesh 2019 Lok Sabha elections to be announced today, exit polls have already predicted the BJP-led NDA will bag maximum Parliamentary seats here. According to early trends, BJP's Smriti Irani is leading with over 4,300 votes from Amethi, overtaking Rahul Gandhi again. The BJP is leading in 56 of Uttar Pradesh's 80 Lok Sabha seats with the BSP-SP alliance ahead in 20 seats, according to Election Commission trends. The Bahujan Samaj Party was leading in 12 and the Samajwadi Party in seven while the Congress was ahead in two and the Apna Dal (Soneylal) in one.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X