వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుర్తు కోసం కష్టాలు, ఎన్నికల కమీషన్ ఎదుట హజరైన రెండు వర్గాలు

ఎన్నికల కమీషన్ వద్ద ములాయం సింగ్, అఖిలేష్ తరపున రాంగోపాల్ యాదవ్ లు హజరయ్యారు. ఎన్నికల గుర్తు కోసం తమ వాదనలను విన్పించుకోవాలని ఎన్నికల కమీషన్ రెండు వర్గాలకు నోటీసులు పంపింది. ఈ మేరకు కపిల్ సిబల్ అఖిలే

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ :ఎన్నికల గుర్తుపై సమాజ్ వాదీ పార్టీలోని ఇరువర్గాలు శుక్రవారం నాడు ఎన్నికల కమీషన్ ను కలిశాయి. ఎన్నికల కమీషన్ ముందు తమ వాదనలను విన్పించారు. ఎన్నికల గుర్తును తమకే కేటాయించాలని కోరుతూ రెండు వర్గాలు తమ వాదనలను ఎన్నికల కమీషన్ ముందు విన్పించారు.

ఎన్నికల గుర్తును తమకే కేటాయించాలని కోరుతూ ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో రెండు వర్గాలు ఈసీని ఆశ్రయించాయి.అయితే ఈసీ తమకు మద్దతును తెలిపే నాయకులతో అఫిడవిట్లను సమర్పించాలని కోరింది. అఫిడవిట్లను సమర్పించిన తర్వాత ఈ నెల 13వ, తేదిన తమ వాదనలను విన్పించాలని కోరింది.

mulayam

ఈసీ ఆదేశం మేరకు ములాయం, అఖిలేష్ తరపున రాంగోపాల్ యాదవ్ లు ఈసీ కార్యాలయానికి వచ్చారు.. అఖిలేష్ యాదవ్ ఈసీ ఎదుట ప్రముఖ న్యాయవాదిని కపిల్ సిబల్ కూడ ఎంచుకొన్నాడు. కపిల్ సబల్ అఖిలేష్ తరపున ఎన్నికల కమీషన్ ఎదుట వాదిస్తున్నారు.

పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అఖిలేష్ ను ఈ నెల 1వ, తేదిన ఎన్నుకొన్నారు. పార్టీకి ప్రజాప్రతినిధులు, నాయకలు అఖిలేష్ వైపే ఎక్కువగా ఉన్నారు. ములాయం వైపు నామమాత్రంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో వాదనలను విన్పించుకొనేందుకు చివరి అవకాశాన్ని కల్పించింది ఈసీ.

ఇరు వర్గాల వాదనలను విన్న తర్వాత ఈసీ తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఇద్దరికీ ఎన్నికల చిహ్నన్ని ఇవ్వకుండా వేర్వేరు గుర్తులను కేటాయిస్తోందా మెజారిటీ పార్టీ నాయకులు ఉన్న అఖిలేష్ కు గుర్తును కేటాయిస్తోందో అనే ఉత్కంఠకు శుక్రవారంతో తెరపడనుంది.

English summary
mulayam, ramgopal attend election commission, urgue for election symbol issued the notice, so they attend the election commission
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X