వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిలేష్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్ళాలి, ములాయం కే నష్టం

అఖిలేష్ నాయకత్వంలో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే పార్టీకి ప్రయోజనమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు అబూ ఆజ్మీ అభిప్రాయపడ్డారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో:సమాద్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కోపం, ఆవేశం పార్టీకి ప్రమాదమని ఆ పార్టీ సీనియర్ నాయకుడు అబూ ఆజ్మీ అభిప్రాయపడ్డారు. పార్టీ ఎన్నికల గుర్తును తమకే కేటాయించాలని కోరుతూ ములాయం సింగ్ నేతృత్వంలోని పార్టీ నాయకులు కొందరు సోమవారం నాడు ఎన్నికల సంఘాన్నికలిసి కోరారు. ఇదే డిమాండ్ తో అఖిలేష్ గ్రూప్ కూడ ఈ విషయమై ఎన్నికల సంఘాన్ని కోరనుంది.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమాజ్ వాదీ పార్టీలో కీలకమైన పరిణామాలు చోటుచేసుకొన్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షపదవిని అఖిలేష్ యాదవ్ కు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం కట్టబెట్టింది. శివపాల్ యాదవ్, అమర్ సింగ్ లపై వేటు వేశారు.

అయితే ఈ సమావేశంపై ములాయం గ్రూపు గుర్రుగా ఉంది.అయితే పార్టీలోని మెజార్టీ నాయకులు అఖిలేష్ నాయకత్వంలో పనిచేసేందుకు ముందుకు వచ్చారు. ఈ పరిణామం కూడ ములాయం గ్రూపుకు మింగుడుపడని విధంగా ఉంది.

మరో వైపు అఖిలేష్ యాదవ్ కూడ ములాయం గ్రూపుకు చిక్కకుండా ఎత్తులు వేస్తూ ముందుుకు సాగుతున్నాడు. అమర్ సింగ్ సహకారంతో చక్రం తిప్పేందుకు ములాయం సింగ్ పావులు కదుపుతున్నాడు.

అఖిలేష్ నాయకత్వాన్ని సమర్థించాలి

అఖిలేష్ నాయకత్వాన్ని సమర్థించాలి

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ నాయకత్వంలో పనిచేసేందుకుగాను ములాయం సింగ్ అనుమతివ్వాలని పార్టీ సీనియర్ నాయకుడు అబూ ఆజ్మీ అభిప్రాయపడ్డారు.అఖిలేష్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్ళడమే పార్టీకి ప్రయోజనమని ఆయన అభిప్రాయపడ్డాడు.పార్టీ నాయకులు ఎక్కువగా అఖిలేష్ కు మద్దతు పలుకుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

పార్టీ విజయం సాధిస్తే సిఎం పదవి అఖిలేష్ కు దక్కదు

పార్టీ విజయం సాధిస్తే సిఎం పదవి అఖిలేష్ కు దక్కదు

త్వరలో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా అఖిలేష్ యాదవ్ ను ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని గతంలోనే పలుమార్లు బహిరంగంగానే అఖిలేష్ చెప్పాడు. అయితే పలు సర్వేలో సమాజ్ వాదీ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా అఖిలేష్ కే ఎక్కువ మార్కులు దక్కాయి. అందుకే ఈ ఎన్నికల్లో పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరనే విషయాన్ని ప్రకటించలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అఖిలేష్ కు ములాయం సహకరిచాలి

అఖిలేష్ కు ములాయం సహకరిచాలి

పార్టీలో మెజార్టీ నాయకులంతా అఖిలేష్ యాదవ్ వైపు ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కు అఖిలేష్ కు సహకరిస్తేనే ప్రయోజనమనే అభిప్రాయాన్ని పార్టీలోని సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు. ములాయం మొండిగా వ్యవహరిస్తే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందని సీనియర్లు అభిప్రాయంతో ఉన్నారు. ఇదే విషయాన్ని అబూ ఆజ్మీ కూడ వ్యక్తం చేశారు.

ములాయం వైపు తక్కువ మంది ప్రజా ప్రతినిధులు

ములాయం వైపు తక్కువ మంది ప్రజా ప్రతినిధులు

ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వైపు పార్టీకి చెందిన సీనియర్లు, ప్రజా ప్రతినిధులంతా నిలిచారుు.అయితే ములాయం వైపు కేవలం 30 మంది సిట్టింగ్ ఎంఏల్ఏలు మాత్రమే నిలిచారు. ఈ పరిస్థితి నేపథ్యంలో పార్టీ ఎన్నికల గుర్తుపై ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాడు ములాయం సింగ్. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో అఖిలేష్ గ్రూప్ కూడ ఎన్నికల సంఘాన్ని కలవనుంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఎన్నికల గుర్తు ఎవరికి వస్తే వారి వైపుకు ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉంది.

English summary
mulayam should leave aside all his anger and should allow the samajwadi party to contest the uttar pradesh assembly polls under akhilesh , party senior told azmi told media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X